రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ కన్నుల విందుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సకాలంలో వర్షాలు పడడంతో వేసిన పంట చేతికి అందటంతో రైతులు తాజాగా వచ్చిన సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో టిఆర్ఎస్ పార్టీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు పశ్చిమగోదావరి జిల్లా కి వచ్చి ఈ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి వచ్చి భోగి పండుగ సందర్భంగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి అదేవిధంగా తెలంగాణ రాజకీయాల గురించి తనదైన శైలిలో కామెంట్ చేశారు.

 

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పనిచేయడం మంచి శుభ పరిణామమని ఈ విధంగా ఇటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రులు కలిసి పనిచేయడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల కు మేలు చేకూరుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మాట్లాడుతూ..ఏపీలో ప్రభుత్వం మారుతుందని గతేడాది సంక్రాంతి సందర్భంగా చెప్పానని.. అలాగే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం పోయి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిందన్నారు.

 

తమ రాష్ట్రం నుంచి ఒకాయనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామన్నామని.. మాట ప్రకారమే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చామని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్‌లో పెద్ద భవనం కట్టి.. నగరమంతా తానే అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు చెప్పుకుతిరుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందని సూపర్ అంటూ మంత్రి తలసాని ప్రశంసించారు. ఇంకా అనేక విషయాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడి ఈ సంక్రాంతి పండుగ అందరికీ శుభం చేకూరాలని...రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: