ఒక తప్పు చేసి, ఆ తప్పు నుండి భయటపడటానికి ప్రయత్నించడం, అంతే గాక ఆ తప్పుడు వెధవలను కాపాడాలని మరో నల్ల కోటు ప్రయత్నించడం ఇలాంటివి సిగ్గులేని చర్యలుగా చెబుతున్నారు. అంతే కాకుండా దోషుల తరపున వాదించడం అనేది న్యాయదేవతకు చేస్తున్న అవమానం. ఇక ఇలాంటి అన్యాయం నీ కూతురికో, లేక నీ యింటిలోని వారికో జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా అని కొన్ని గొంతుకలు ప్రశ్నిస్తున్నాయి.

 

 

ఇదంతా చెప్పేది ‘నిర్భయ’ దోషుల గురించి. మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఇలాంటి వెధవలు చావాలని కోరుకుంటారు. కాని వీరి తరపున న్యాయవాది ఎన్ని కోట్లు పుచ్చుకున్నాడో ఈ వెధవల్ని సాద్యమైనంత వరకు కాపాడాలని ప్రయత్నిస్తున్నాడట. దీనిపై సామాజిక సృహతో ఆలోచించే ఆడపిల్లలున్న తల్లిదండ్రులు దుమ్మెత్తి పోస్తున్నారట. ఇకపోతే చేసింది ఒక మంచిపని అని ఈ రాక్షసులు తమ ప్రాణాలు కాపాడు కోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు.

 

 

ఒక ప్రాణం తీసే ముందు తెలియదా తాము ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో అని.. అన్ని చేసి ఇప్పుడు పశ్చాతాప పడకుండా మమ్మల్ని  క్షమించండి అంటే చట్టం గాజులు తొడుక్కుని కూర్చోలేదుగా. నిజంగా ఇప్పటికే మరణించిన నిర్భయ ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో. ఇలాంటి దుర్మార్గులు ఇంకా బ్రతికి ఉన్నందుకు.. ఇక  మరణ శిక్ష తప్పించుకునేందుకు ‘నిర్భయ’ దోషులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

 

 

తాజాగా దోషుల్లో ఒకరైన ముకేశ్‌ మంగళవారం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆశ్రయించాడు. నిర్భయ దోషులు అయినా వినయ్‌ శర్మ(26), ముకేశ్‌ కుమార్‌(32), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31), పవన్‌ గుప్తా(25)లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు జనవరి 7వ తేదీన డెత్‌ వారంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

 

 

ఈ నేపథ్యంలో వారిలో ఇద్దరు వినయ్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌లు దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్లను మంగళవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ దుర్మార్గులు బయటపడాలని ఎన్ని నక్క జిత్తుల వేషాలు వేసిన ఇప్పటి వరకు బ్రతికింది చాలు ఇకనైన త్వరగా ఈ కధకు ముగింపు పలికితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: