అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ దాదాపుగా నెల రోజులుగా రోడ్డెక్కిన రైతులకు హైకోర్ట్ బెంచ్ ఇస్తే సరేనంటా. చివరికి ఆడోళ్లను కూడా రోడ్డు మీదకు లాగింది దీని కోసమేనా. ఆ ప్రాంతంలో తలపండిన రాజకీయవేత్త అయిన రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకటరావు మాటల దోరాన్ని చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. అసలీ రాజధాని అమరావతి గురించి ఆయనెంటున్నాడో ఒక సారి పరిశీలిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకటరావు విమర్శించారు. ఎక్కడా కూడా ప్రభుత్వం మారితే రాజధానులు మార్చలేదని ఎద్దేవా చేశారు. పరిశ్రమల ద్వారానే అభివృద్ధి సాధ్యం తప్ప రాజధానులు వల్ల అభివృద్ధి సాధ్యం కాదని యడ్లపాటి స్పష్టం చేశారు.17 లోపల రైతులు హై పవర్ కమిటీకి విన్నవించుకోవాలని చెప్తున్నారు బాగానే ఉంది. అయితే  ప్రభుత్వం మాత్రం రాజధానిని ఏమి చెస్తారో మాత్రం చెప్పటం లేదన్నారు. మూడు రాజధానుల విషయంలో ఉద్యోగస్తులు, ప్రజలు, అందరు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. 

రాజధాని ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అంటున్నారన్నది వాస్తవమేనని చెప్పారు. ఆ సామజిక వర్గం తప్పు మిగతా కులాలు రాజధాని ప్రాంతంలో ఎక్కువగానే ఉన్నారన్నవిషయాన్ని ప్రభుత్వం ముఖ్యంగా సీఎం జగన్ గమనించాలన్నారు.    . విశాఖ ప్రాంతం అంటే చంద్రబాబుకి ప్రేమ ఎక్కువ దానికి నిదర్శనం తుఫాన్ వల్ల నష్టపోతే అక్కడే ఉండి పనులు పూర్తి చేస్తారు. జగన్ మాత్రం విశాఖ తుఫాన్ వచ్చినప్పుడు కనీసం ప్రక్కనే ఉండి తొంగి కూడా చూడలేదు. అలాంటప్పుడు జగన్ కి విశాఖ మీద ఎలా ప్రేమ పుట్టిందో ఆయనకే తెలియాలి

హైకోర్టు బెంచ్ ఇస్తే ఎవరికి అభ్యతరం లేదు. రాజధాని ప్రాంతంలో ఏమి జరుగుతుందని  హైకోర్టు సుమోటోగా తీసుకొని ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మీద, మహిళ మీద ఇంత దారుణంగా  దాడులకు పాల్పడడం తానెప్పుడూ చూడలేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మీద వైస్సార్సీపీ వాళ్ళే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కుదిరితే అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి తప్ప కులాల, మతాలు, మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణి మార్చుకోవాలని హితవు చెప్పారు. తొమ్మిది సంవత్సరాలు పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ ని హితోధికంగా అభివృద్ధి చేసారని చెప్పారు. 

అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ ని కూడా అభివృద్ధి చెయ్యాలని చంద్రబాబు చూశారని అయన అన్నారు.   ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధాని వద్దు, పోలవరం వద్దు అనే ధోరణిలో ఉన్నారని దుయ్యబట్టారు. ఎక్కడికక్కడ విడగొట్టడం తప్ప ఎక్కడ అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రం ముఖ్యమంత్రిలో  కనపడటం లేదని వెంకట రావు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 20న ఏపీ కేబినెట్‌ సమావేశం, అసెంబ్లీ ప్రత్యేక సమా వీసాలను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసుకునేందుకు అర్ధాంతరంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైపవర్‌ కమిటీ ఇచ్చే నివేదికను ఏపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తుందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: