ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి అమరావతిలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులందరూ ధర్నాలు రాస్తారోకోలు చేపడుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం తాము మూడు పంటలు పండించుకునే భూమిని త్యాగం చేస్తే ఇప్పుడేమో రాజధాని అమరావతి నుంచి మారుస్తాము అంటే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైతులు రైతు కుటుంబీకులు మొత్తం రోడ్డు మీదికి చేరి నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు. 

 

 

 ఇక రాజధాని అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన రెండు కమిటీలు జగన్మోహన్రెడ్డి 3 రాజధానిల నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదికలు అందించడంతో అమరావతి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అమరావతిలో రాజధాని ఏర్పడడం వల్ల తమ  భవిష్యత్తు తరాలు బాగుంటాయని ఎన్నో కలలు కన్నామని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మారిస్తే తమ పిల్లలకు భవిష్యత్తు ఉండదు అంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మనస్తాపం చెంది ఎంతో మంది రైతులు మరణిస్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగ కూడా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలతోనే గడిచిపోతుంది. 

 

 

 ఇక తాజాగా అమరావతి కోసం ఆందోళన చేస్తున్న మరో రైతు గుండె ఆగిపోయింది. రాజధాని తరలింపు నిరసిస్తూ దాదాపు నెల రోజుల నుండి జరుగుతున్న ఆందోళనలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి చెందిన రైతు ఇడుపులపాడు వెంకటేశ్వరావు నిరసనల్లో లో పాల్గొంటున్నారు. రాజధాని నిర్మాణానికి ఆయన తనకున్న 20 సెంట్ల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఇక ఇప్పుడు రాజధాని మార్చొద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. రాజధాని తరలింపు తథ్యం అని  మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ఆ రైతు. నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: