తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ అభ్యర్ధులకు రెబల్స్ పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. రేపటి ఎన్నికల్లో రెబల్స్ వల్ల   పార్టీ అభ్యర్ధుల కొంప ముణగటం ఖాయమని అర్ధమైపోతోంది. 120 మున్సిపాలిటిల్లోని 2727 వార్డులు, తొమ్మిది కార్పొరేషన్లలోని  325 డివిజన్లలో  25, 336 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.

 

ఉపసంహరణల తర్వాత మొత్తానికి సుమారుగా 20 వేలమంది పోటిలో ఉంటారనే అంచనాలు పెరిగిపోతున్నాయి. అంటే వీరిలో అత్యధికులు అధికార టిఆర్ఎస్ అభ్యర్ధులు+రెబల్స్ అన్న విషయం అర్ధమైపోతోంది. రెబల్స్ ను బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించకునేట్లు నేతలు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. ఎందుకంటే రెబల్స్ గా నామినేషన్లు వేసిన వాళ్ళు తర్వాత అడ్రస్ లేకుండా  మాయమైపోయారు.

 

రెబల్స్ సమస్య టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బిజెపిలకు కూడా ఉన్నా అధికారపార్టీకే చాలా ఎక్కువని అర్ధమైపోతోంది. ఇంతపెద్ద సంఖ్యలో రెబల్స్ నామినేషన్లు వేస్తారని కేసియార్ తో పాటు సీనియర్ నేతలెవరూ ఊహించలేదు.  అందుకనే రెబల్స్ దెబ్బకు ఇపుడు అందరూ తలలు పట్టుకున్నారు. ఇక్కడ రెబల్స్ అంటే రెండు రకాలున్నారు. మొదటి రకమేమో టిఆర్ఎస్ రెబల్సుగానే పోటి చేయటం.

 

ఇక రెండో రకమేమో చివరి నిముషంలో ఇతర పార్టీల్లోకి దూకి బిఫారాలు అందుకుని నామినేషన్లు వేయటం. రెండింటిలో ఏదైనా  తలపొప్పులు మాత్రం టిఆర్ఎస్ కే అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పై రెండు పద్దతుల్లో  ఏ విధంగా రెబల్ అభ్యర్ధులు రంగంలో ఉన్న పార్టీ నేతలు, క్యాడర్లో కూడా చీలిక వచ్చేస్తోంది. ఇద్దరు నేతల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్ధంకాక కొందరు నేతలు మాయం అయిపోతున్నారట.

 

జరగబోయే నష్టాన్ని ఊహించిన సీనియర్ నేతలు నష్ట నివారణకు దిగినా పెద్దగా ఫలితం కనబడలేదని సమాచారం.   పైగా కేసియారేమో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మంత్రి పదవులకు లింకు పెట్టి కూర్చున్నారు. దాంతో రెబల్స్ సమస్య ముందుగా మంత్రులకు తర్వాత ఎంఎల్ఏల మీద పడింది. అందుకనే అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: