ప్రస్తుతం ఆన్లైన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రపంచం నడుస్తోంది. ఒకప్పుడు మైదానం కి వెళ్లి ఆటలు ఆడే వాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అన్ని ఆటలు మొబైల్ ఫోన్ లోనే ఆడేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో అన్ని ఆటలు మొబైల్ లోనే దొరికేస్తున్నయి. ఇక ఆన్లైన్లో ఎంటర్టైన్మెంట్ అయితే సినిమాల కంటే ఎక్కువ దొరుకుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం యువతని కాదు పెద్దలు చిన్నలు అందరినీ కలిపి ఎక్కువగా ఆకర్షిస్తుంది  అందరికీ గుర్తొచ్చే పేరు టిక్ టాక్. ఇది నాటి తరం నేటి తరం వరకు అందరినీ ఆకర్షిస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి యాప్   ఆన్లైన్లో రాకపోవడంతో టిక్ టాక్ కు ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. 

 

 

 దీంతో ఇందులో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడ మగ తేడా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వీడియోలు చేస్తూ ఉంటారు. దిగ్గజ ఆన్లైన్ యాప్ లైన  ఫేస్బుక్ వాట్సప్ లను  సైతం వెనక్కి నెట్టి దూసుకుపోతుంది టిక్ టాక్. ప్రస్తుతం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు కలిగినది టిక్ టాక్. ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. టిక్ టాక్ లో వీడియోలు చేసి ఆనందపడే వాళ్లు కొంతమంది అయితే.. ఇతరులు చేసిన వీడియోలను  చూసి ఆనందపడే వాళ్ళు కొంతమంది. రోజురోజుకు టిక్ టాక్ ని వాడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది కానీ తగ్గడం మాత్రం జరగడం లేదు. 

 

 

 ఇక ఇక్కడ ఒక విచిత్ర సంఘటన జరిగింది. అక్క తమ్ముడు కలిసి వీడియో షేరింగ్ ఆప్ టిక్ టాక్ లో సరదాగా ఒక వీడియో చేశారు,  ఆ వీడియో వారిద్దరిని అవమానాల పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట్ లో అక్క తమ్ముడు కలిసి టిక్ టాక్ లో ఒక వీడియో చేశారు... ఇక ఆ వీడియో చూసిన మరో యువతి ఆ వీడియోలో ఉన్నది అక్క తమ్ముడు కాదని ఆమె ఒక వ్యభిచారి  అని కామెంట్ చేసింది. ఆమె ఫోన్ నెంబరు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసింది. దీంతో ఆమెకు వేధింపుల  కాల్స్ మొదలయ్యాయి. రోజు రోజుకి కాల్స్  ఎక్కువవడంతో బాధిత అక్క తమ్ముడు నిన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: