ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానిల  ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతి వ్యాప్తంగా రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు రాజధాని అమరావతి నుంచి తరలించ వద్దు అంటూ ధర్నాలు రాస్తారోకోలు చేపడుతున్నారు. ఇక రైతుల ధర్నాలు రాస్తారోకోలకు  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా మద్దతు ప్రకటించారు రైతుల నిరసనకు . అంతేకాకుండా అమరావతి రైతులు బాధతో విలవిలలాడుతూ ఉంటే తాము సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటాము అంటూ తెలిపిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక నేడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత అయిన చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఈరోజు ఉదయం తన కోడలు మాజీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి తో కలిసి రాజధాని గ్రామాల పర్యటనకు బయలుదేరారు. వీరు మరికాసేపట్లో తుళ్లూరు చేరుకోనున్నారు. అక్కడ ధర్నా చేస్తున్న రైతులు మహిళలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. వెలగపూడి మందడం గ్రామాల్లో కూడా వీరు పర్యటించనున్నారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీరితో కలవనున్నారు. రాజధాని అమరావతి నుంచి తరలించ వద్దు... జగన్ మూడు రాజధానిల  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న  నిరసనలకు చంద్రబాబు కుటుంబం సంఘీభావం తెలిపనుంది . 

 

 

 కాగా నేడు జరిగేవీ  సంక్రాంతి సంబరాలు కాదు  సంక్రాంతి నిరసనలు అని  అమరావతి పరిసర గ్రామాల రైతులు చెబుతున్నారు. తాము మూడు పంటలు పండించుకునే భూమిని అమరావతి నిర్మాణం కోసం తీసుకుని తమకు నిలువ నీడ లేకుండా చేసి ఇప్పుడు తమను  రోడ్డుపై పడవేశారని ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. ఇక ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల కోసం చంద్రబాబు ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె వెల్తుందన్న  సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం మాత్రం అమరావతి రైతుల నిరసనలు దృశ్య  చంద్రబాబు సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటానని ముందే ప్రకటించారు. ఇక ప్రకటించిన విధంగానే రైతుల నిరసన కు మద్దతు తెలుపుతూ సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: