సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా జరుగుతున్నది.  కోనసీమలో ఈ పండగను ఘనంగా నిర్వహిస్తుంటారు. కోళ్ల పందేలతో హడలెత్తిస్తుంటారు.  అయితే, కోడిపందేలను అడ్డుకుంటామని చెప్పిన ప్రభుత్వం, మాటల చెప్పడం వరకే అని అర్ధం అయ్యింది.  కోడిపందేలు అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. కోడిపందేలు అడ్డుకుంటే మాత్రం ప్రభుత్వం పనైపోతుందని హెచ్చరించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు.  


అటు చిత్తూరు జిల్లాలో కూడా పండగ ఘనంగా జరుపుకుంటున్నారు.  ఇప్పటికే అక్కడ జల్లికట్టును ఘనంగా నిర్వహిస్తున్నారు.  జల్లికట్టులో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో గాయాల బారిన పడుతున్నా సరే జల్లికట్టును నిర్వహించడం మాత్రం ఆపరు.  సరదాగా మొదలైన ఈ గేమ్ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నది.  అటు కోడిపందేలయితే చెప్పక్కర్లేదు.  ఈ నాలుగైదు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులుమారతాయి.  


ఇక ఇదిలా ఉంటె, అమరావతి రైతులు మాత్రం పండగను చేసుకోవడం లేదు.  అమరావతి కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం భూములను ధరాతత్తం చేశారు.  కానీ, ఇప్పుడు ప్రభుత్వం అమరావతిని కాదని, కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నది.  ఇలా చేయడం వలన రాజధాని రైతులు ఇబ్బందులు పడతారు.  అంతేకాదు, అమరావతి కోసం బంగారం లాంటి 33 వేలఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు.  


అంతేకాదు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్వితీయమైన రాజధాని ఉండాలి అని చెప్పి రైతులు భూములు ఇచ్చారు.  ఈ భూములు ఇప్పుడు దేనికి కాకుండా పోతున్నాయి.  భూమికి వ్యాల్యూ పడిపోయింది.  ఇదే ఇప్పుడు ప్రజల ముందు ఉన్న సమస్య.  సమస్య పరిష్కారం జరిగిన రోజున నిజమైన సంక్రాంతి చేసుకుంటామని అంటున్నారు రైతులు.  మరి రైతుల కలలు నెరవేరుతాయా చూద్దాం. ప్రతిపక్షాలు కూడా సంక్రాంతి పండగను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: