ఈనెల 20వ తేదీన మొదలవబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడుకు సినిమా చూపించటానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది.  మూడు రాజధానుల ప్రతిపాదనపై జగన్ చేసిన ప్రతిపదన, కమిటిల నివేదికలు, హైపవర్ కమిటి సమావేశాల సారాంశం తదితరాలపై చర్చ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. సమావేశాలు రెండు రోజులుంటుందో లేకపోతే మూడు రోజులుంటుందో చూడాలి.

 

జగన్ ప్రతిపాదన తర్వాత  చంద్రబాబునాయుడు ఏ స్ధాయిలో రచ్చ చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమం అంటున్నారు. ఉద్యమం కోసం చందాలంటున్నారు. ఉద్యమ చందాల పేరుతో రాష్ట్రంలో జోలె పట్టారు. అంటే ఇదంతా చూస్తుంటే చాలా డ్రామాలాడుతున్నట్లు అర్ధమవుతోంది. కానీ రచ్చ రచ్చే కదా. తనకున్న ఎల్లోమీడియా మద్దతుతో  జనాల స్పందనతో సంబంధం లేకుండా చంద్రబాబు యాగీ చేసుకుంటూ పోతున్నారు.

 

అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాలపై చంద్రబాబును వాయించేయటానికి జగన్ ఫుల్లుగా ప్రిపేర్ అవుతున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి.  2014 లో అమరావతిని చంద్రబాబు ప్రకటించటంతో మొదలుపెడితే, ఇన్ సైడర్ ట్రేడింగ్, రైతుల నుండి బలవంతంగా భూముల సేకరణ, రాజధాని గ్రాఫిక్కులు చూపించి జనాలు మోసం చేయటం, సింగపూర్ కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్లతో జనాలు మోసం చేయటం లాంటి చాలా అంశాలపై ఇప్పటికే అవసరమైన సమాచారాన్ని తెప్పించుకున్నాడట జగన్.

 

జగన్ కు మద్దతుగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలినాని, బొత్సా సత్యనారాయణ, మేకపాటి  గౌతమరెడ్డితో పాటు ఎంఎల్ఏలు రోజా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు దుమ్ము దులపటానికి రెడీ అవుతున్నారట.  వీళ్ళు కాకుండా స్టాండ్ బై గా మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలు ఉండనే ఉన్నారు. వీళ్ళను చంద్రబాబు అండ్ కో ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాల్సిందే.  చూద్దాం అసెంబ్లీలో చివరకు ఏం జరుగుతుందో .

మరింత సమాచారం తెలుసుకోండి: