దేశ ఆర్థిక వ్యవస్థ కి వెన్నెముక రైల్వే వ్యవస్థ అని చాలామంది ఆర్థిక నిపుణులు అంటుంటారు. పేద మరియు మధ్య తరగతులు జీవనానికి అనుగుణంగా ప్రయాణాల ఖర్చులకు తగిన విధంగా భారతీయ రైల్వే సంస్థ టికెట్ ధరలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే వాటి ధరలు ఎలా ఉన్నా గాని భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైళ్లు మరియు వాటి ధరలు కేవలం ఐశ్వర్యవంతులు మాత్రమే వాటిలో ఉన్న సుఖభోగాలను అనుభవించిన రైలు భారతీయ రైల్వే వ్యవస్థలో ఉన్నాయని ఎవరికీ పెద్దగా తెలీదు.

 

కేవలం వీటిలో ఐశ్వర్యవంతుల కుటుంబాలు భారతదేశంలో ఉన్న అద్భుతమైన ప్రకృతి అందాలను తిలకించడానికి ప్రయాణం చేస్తుంటారు. ఒక చోట నుండి మరొక చోటికి అనే గమ్యం తేడా లేకుండా ఈ రైలు ఒకపక్క ప్రణాళికాబద్ధమైన ప్రయాణం ద్వారా భారతదేశం యొక్క విస్తృతమైన సౌందర్యాన్ని మీ కళ్లకు కడుతూ వివిధ ప్రముఖ పర్యాటక నగరాల గుండా మిమ్మల్ని తీసుకువెళ్తాయి. అంతేకాకుండా ప్రత్యేక భోజనం, సంస్కృతిక అనుభవాలు, సైట్ సీయింగ్, షాపింగ్ వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి. 5 స్టార్ హోటల్ మాదిరి అన్ని సౌకర్యాలను ప్రయాణికులు ఈ రైళ్లలో పొందవచ్చు.

 

అటువంటి రైళ్ళ పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశంలో అత్యంత విలాసవంతమైన రైలులో మొదటిగా మహారాజా ఎక్స్ ప్రెస్ పేరుగాంచింది. ఈ రైలు దేశంలో పడమటి నుండి ఉత్తరం వైపుగా సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఏ రైలు ప్రపంచ ట్రావెల్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇందులో ప్రయాణించాలంటే ప్రారంభ ధర: ఒక్కరికి 3,850 యూఎస్ డాలర్లు (రూ.275,292లు). తర్వాత స్థానంలో ఖరీదైన రైళ్లలో భారతదేశపు వారసత్వం (హెరిటేజ్ ఆఫ్ ఇండియా) దీనిలో ప్రయాణించాలంటే ప్రారంభ ధర: ఒక్కరికి 6,840 యూఎస్ డాలర్లు (రూ. 489,175లు). మరియు అదే విధంగా భారతదేశపు రత్నాలు (జెమ్స్ ఆఫ్ ఇండియా) ఇది కూడా ఖరీదైనా రైలు. దీనిలో ప్రయాణించాలంటే ప్రారంభ ధర: ఒక్కరికి 3,850 యూఎస్ డాలర్లు (రూ.275,292లు). ఇంకా కొన్ని రైలు పేర్లు గమనిస్తే:

భారతీయ శోభ (ఇండియన్ స్ప్లెండర్)

ప్రారంభ ధర: ఒక్కరికి 5,980 యూఎస్ డాలర్లు (427,645)

విశాలమైన భారతదేశం (ఇండియన్ పనోరమ)

ప్రారంభ ధర: ఒక్కరికి 5,980 యూఎస్ డాలర్లు (427,645).

 

ఇంకా చాలానే ఐశ్వర్యవంతులు మాత్రమే ప్రయాణించే రైళ్లు మనదేశంలో ఉన్నాయి. ఇంచుమించు వాటి ధరలు ఈ విధంగానే ఉంటాయి. 

 

 

 

 

  

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: