తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరందుకున్నాయి. సంప్రదాయకబద్ధంగా జరుగుతున్న కోడిపందేలను చూడటానికి గోదావరి జిల్లాలకు ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చారు. కోడి పందేల నిర్వహణకు నిర్వాహకులు ప్రత్యేకమైన బరులను కూడా ఏర్పాటు చేశారు. కోడిపందేలు మరో రెండు రోజుల పాటు జరుగుతాయని గోదావరి వాసులు చెబుతున్నారు.                                                               
 
ప్రతి సంవత్సరం ఇలాంటి పందేలు నిర్వహిస్తామని సంప్రదాయకబద్ధంగానే ఈ పందేలను నిర్వహిస్తున్నామని కోడి పందేల నిర్వాహకులు చెబుతున్నారు. వందల సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాల్లో జరిగే పందేలను చూడటానికి విదేశాల నుండి కూడా వచ్చి పందేలను తిలకిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కత్తులు లేకుండా కోడి పందేలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. 
 
పందేలను నిర్వహించటానికి తాము ఎంతో సంతోషంగా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలో చాలా జిల్లాల్లో కోడి పందేలు జరుగుతాయని కానీ గోదావరి జిల్లాల్లో మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువగా జరుగుతాయని చెబుతున్నారు. కోడిపందేలు, ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని ప్రజలు ఉత్సాహంగా పోటీలలో పాల్గొంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. 
 
గ్రామీణ క్రీడగా కోడి పందేలను చూడాలని పశ్చిమ గోదావరి వాసులు డిమాండ్ చేస్తున్నారు. సంస్కృతీ సాంప్రదాయాల్లో భాగంగానే కోడి పందేలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. వైసీపీ పార్టీ నేతలే గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల కోడి పందేలను ప్రాంరభించినట్టు తెలుస్తోంది. కోడి పందేలు, గుండాట, పేకాటలతో బరులు కిక్కిరిసిపోయాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: