సంక్రాంతి పండుగ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అచ్చ తెలుగు... సంప్రదాయం ఉట్టిపడేలా తెలుగు ప్రజలందరూ జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో హడావిడి  మామూలుగా ఉండదు. ఇక ఈ హడావిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉంటుంది. హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు ఆడ పడుచుల రంగురంగుల రంగవల్లులు... అదిరిపోయే సాంప్రదాయ వస్త్రాలు ఇలా ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ నాడు కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముఖ్యంగా అల్లుళ్లు ఇంటికి వస్తూ ఉంటారు. అల్లులను మామలు ఇంటికి ఆహ్వానించడం వారికి సకల మర్యాదలు చేయడం చెబుతున్నారు. 

 

 

 ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిండివంటలు ఉండాల్సిందే. మూడు రోజుల పాటు రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. మూడు రోజులపాటు వేరు వేరు పిండి వంటలు చేసే కొత్త అల్లుళ్లకు పెట్టడం... బంధుమిత్రులందరికీ పిండి వంటలు వండి పెట్టడం చేస్తూ ఉంటారు. ఇక ఇంటికి వచ్చిన అల్లుళ్ళు  ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉండడం... మామలు ఇస్తాము అంటూ హామీలు ఇస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇక బావ మరదల్ల  సరసాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి సంక్రాంతిలో . సంక్రాంతి వచ్చిందంటే చాలు అల్లుళ్లు అందరూ ఇంటికి చేరి పోతూ ఉంటారు. ఇక ఇంటికి చేరిన అల్లుళ్లను బాగా సంతృప్తి పరచాలంటే పిండివంటలు మటన్ చికెన్ అన్ని ఉండాల్సిందే కదా. లేకపోతే అల్లుడు హార్ట్ అవుతాడు మరి. 

 

 

 కానీ ఈ ఏడాది మాత్రం అందరికీ సంక్రాంతి భారంగా మారింది. సంక్రాంతి పండుగ అంటే అందరూ సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకునే పండుగ. భారీగా పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతికి మాత్రం  సామాన్యులకు భారంగా మారి పోయింది. ఎందుకంటే ప్రస్తుతం పిండి వంటల కోసం వాడే మంచి నూనె కిలో వంద రూపాయలు పలుకుతుంది .. ఇక మిగతా సామాన్లు  ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండటం ... ఇలా ప్రతి ఒక్కటి భారీగా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు సంక్రాంతి భారంగానే మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: