అప్పుడే 2020 వ సంవత్సరం వచ్చేసింది.  సంక్రాంతి పండగ తెలుగు ప్రజలకు అతిపెద్ద పండగ అని చెప్పాలి.  ఈ పండగ రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి తప్పనిసరిగా గుడికి వెళ్లి పూజలు చేయించుకొని వస్తారు.  అలా వచ్చిన తరువాత శుచిగా భోజనం వండుకొని తినేసి హ్యాపీగా స్నేహితులతో కుటుంబ సభ్యులతో కాలం గడిపేస్తుంటారు.  ఇలా ఈ ఒక్క పండగకు మాత్రమే సాధ్యం అవుతుంది.  


దసరా రోజుల్లో కూడా ఇలా చేస్తారు.  కాకపోతే, చాలా తక్కువగా చేస్తుంటారు.  ఎందుకంటే, దసరా అన్నది అమ్మవారికి చేసే పూజ.  కానీ, సంక్రాంతి ఓ పండగ.  కొత్తధన్యం ఇంటికి వస్తుంది.  ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది రైతుల పండగ.  రైతులు నిత్యం పొలంలో కష్టపడతారు.  పంట పండిస్తారు.  అలా పండించిన పంటకు ఇంటికి తీసుకెళ్లే సమయంలో జరుపుకునే పండగ ఇది.  రైతులు పండించే పంటకు సహాయ సహకారాలు అందించే పశువులను కూడా కొత్తగా అలంకరిస్తారు.  


ఎందుకంటే రైతు ఎంతలా కష్టపడ్డాడో అంతకంటే ఎక్కువగా ఈ పశువులు కూడా కష్టపడుతుంటాయి.  ఒకప్పుడు ఒక పంట వేస్తె చేతికి రావడనికి ఐదారు నెలల సమయం పట్టేది.  కానీ, ఇప్పుడు మొత్తం మారిపోయింది.  ఈరోజు పంట వేస్తె ఓ నెల రెండు నెలల్లోనే పంటలు చేతికి వస్తున్నాయి.  మొక్కల్లో ఉండే జీన్స్ ను చేంజ్ చేస్తున్నారు.  పంటలు త్వరగా పండేందుకు కావాల్సిన ఎరువులను కూడా అధికంగా వేసి పండిస్తున్నారు.  


ఇలా చేయడం వలన పంటలు రెండు నెలల్లోపే పంట చేతికి వస్తున్నది. పంట చేతికి వచ్చిన ప్రతిసారి కూడా సంక్రాంతి చేసుకోవాలి అంటే కష్టం కదా మరి.  అందుకే సంవత్సరం దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే సమయంలో ఈ పండగను జరుపుకుంటారు.  అంతేకాదు, ఈ సంక్రాంతి రోజున పెద్దలకు పూజలు చేస్తారు.  వారి ఆశీర్వాదం తీసుకుంటారు.  వారి ఆశీర్వాదాలు తీసుకుంటే అన్నిరకాల సమస్యలు తీరిపోతాయి.  అందరికి శుభం కలుగుతుంది.  అందరూ హ్యాపీగా ఉంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: