తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతూ వుంటాయి.ఇక  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ సంబరాలకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే  రెండు కళ్ళు సరిపోవు అని అనడం అతిశయోక్తి లేదు. మునుపెన్నడూ చూడని విధంగా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అందరూ సొంతూళ్లకు చేరుకుని సందడి చేస్తుంటారు . ఇక కొత్త అల్లుళ్లు అందరూ అత్తమామల ఇంటికి చేరుకుని సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేస్తు హడావిడి  చేస్తున్నారు. 

 

 

 అయితే జహీరాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి అంటే చిరుధాన్యాలు.. పాటలు కోలాటాలు వివిధ ధాన్యాలతో అలంకరించిన ఎడ్లబండ్లతో ప్రదర్శన ఉంటుంది. సేంద్రియ విధానంలో పంటల సాగు వాటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు.. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 20 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కొనసాగుతోంది. అధికారులు రాజకీయ నాయకులు శాస్త్రవేత్తలు అందరూ ఒకే వేదిక పైకి వచ్చేలా పాత పంటల పండుగ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనాడు ప్రారంభమయ్యే ఈ పాత పంటల పండుగ 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో కొనసాగుతోంది. 

 

 సులువుగా చక్కగా పౌష్టికాహారాన్ని పొందాలంటే దానికి ఒకే ఒక మార్గం చిరుధాన్యాలు. చిరుధాన్యాల వల్ల ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. చిరుధాన్యాలు ఎంతో ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు.. చౌకగానే లభిస్తుంటాయి. అయితే ఈ చిరుధాన్యాల తో వివిధ రకాల వంటలు తయారు చేసి... వాటిని ఫుడ్ ఫెస్ట్ పేరుతో అందరికీ ప్రదర్శిస్తూ ఉంటారు. అంతే కాకుండా రైతులందరికి  ఏ నేలలో ఎలాంటి పంటలు పండిస్తే అధిక దిగుబడిని సాధించి లాభాల బాటలో నడువచ్చు అనే దానిపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇక భాగ్యనగరం నుండి  కూడా ఇక్కడికి ఎక్కువ మొత్తంలో ప్రజలు వస్తుంటారు. తమ పిల్లలకు చిరుధాన్యాల ఆహారం పై అవగాహన కల్పించేందుకు పాత పంటల పండుగకు విచ్చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: