కరుడు కట్టిన ఉగ్రవాదిలా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.  ఇది ముంపు ప్రాంతం కానేకాదన్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అని, మీ మీద కోపం చూపిస్తున్నారని సీఎం జగన్ వైఖరిని ఎత్తి చూపారు. ఇక్కడ ఉన్న వన్ని పర్మినేట్ బిల్డింగ్స్ అని చెప్పారు. రైతులు త్యాగాన్ని గుర్తించలేని స్థితిలో సీఎం వున్నారని  మండిపడ్డారు. రాజధాని ఒకే సారి నిర్మించాలని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం సీఆర్డీఏ ఏర్పాటు చేసి, నిర్మాణం మొదలు పెట్టామని చెప్పారు.  అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్ళ అని అన్నారు. అమరావతిని చంపేసి ఒక కన్ను పోగొట్టాడని విమర్శించారు. పోలవరం పనులు ఆపేసి- రెండో కన్నుకుడా చంపేసాలా వున్నారని ఆరోపించారు. అమరావతి కంటే ముందుగా కీయా మోటార్స్ వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే పోర్ట్స్ చాలా వున్నాయని చెప్పారు. 
ఒకే ప్రాంతంపై నాకు అభిమానం కాదు- అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది  నా కోరిక అని చంద్రబాబు తెలిపారు. చాలా మంది భూములు ఇచ్చి గుండె పోటుతో మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. నా జీవితంలో ఎప్పుడు జోలె పట్టుకోలేదన్నారు. మీ కోసం జోలె పట్టుకున్నానని నమ్మపలికారు. ఎడ్ల పందెలకు వెళ్లే చొరవ ఉందని విమర్శించారు. రైతులు చాయిపోతే ఏమి పట్టడం లేదన్నారు. ఎడ్ల పందేలు, కోడి పందేలు పేకాటలు ఆడుకువడంలో మంత్రులు బిజీగా వున్నారు.

సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పలేనని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎందుకంటే మన అందరికి ఇది కష్టాల సంక్రాంతి అని చెప్పారు. మందడంలో జరుగుతున్నా మహా ధర్నాకు ఆయన కుటుంబ సమేతంగా వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రతి ఏటా నారావారి పల్లెకి సకుటుంబ పరివారమంతా వెళ్లే వాళ్ళమని తెలిపారు. అక్కడ తామంతా మూడు రోజుల పాటు పండుగ చేసుకునే వాళ్ళమని చెప్పారు. ఈ సారి పండగ చేసుకోవడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది కేవలం  29 గ్రామాల సమస్య కాదని అన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అని చెప్పారు. రాజధాని కోసం గతంలో 29 గ్రామాల రైతులు త్యాగాలు చేసారని చెప్పారు. 

 సంక్రాంతి రోజు రైతులు, మహిళలతో ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం ఇష్టం మొచ్చినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ మూర్ఖుడు అని చెప్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. శివరామకృష్ణ కమిటీ పరిశీలించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారని చెప్పారు. రాజధాని విషయంలో అధైర్యపడి ప్రాణ త్యాగాలు చెయ్యొద్దని సూచించారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పారు. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని సిఎం వై ఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: