ఎపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు రాకుండా కూడా జాగ్రత్తపడుతున్నారు. దీని ప్రకారం ఎపి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమతుల్య అబివృద్ది చట్టం 2020 పేరుతో ఈ బిల్లు తీసుకు వస్తున్నారు. ఇందులో ఎక్కడా రాజదానిని మార్చుతారన్న ప్రస్తావన ఉండదు. విశాఖపట్నానికి సచివాలయం తరలింపు తదితర అంశాలేవీ ఇందులో ఉండవు. అలాగే ఆయా శాఖలను ఆయా ప్రాంతాలలో నెలకొల్పుకునే అదికారాన్ని కూడా బిల్లులో పొందుపరుస్తున్నారు. ప్రభుత్వం తలపెట్టిన నాలుగు ప్రాంతీయ బోర్డుల అంశం కూడా ఈ బిల్లులో పెట్టవచ్చని చెబతున్నారు. ఈ నెల పద్దెనిమిది నాటికి హై పవర్ కమిటీ నివేదిక ఇవ్వవచ్చు. ఆ తర్వాత ఇరవై తేదీ ఉదయం మంత్రివర్గ సమావేశం దీనిని ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో పెడతారు. తదుపరి రోజు శాసనమండలిలో పెడతారు.ఒకవేళ కౌన్సిల్ లో టిడిపి మెజార్టీ ఉన్నందున అక్కడ తిరస్కరణకు గురైతే, తరిగి అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేయవచ్చని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మందడం, తుళ్లూరుల్లోనూ మకర సంక్రాతి పర్వదినాన మహాధర్నాలు నిర్వహించారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగుతు న్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు నిర్వహించి నిరసనలు తెలపనున్నారు. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి.

రాష్ట్రం మొత్తం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం సీఆర్డీఏ  చట్టాన్ని రద్దు చేసే యోచలో ఉందని రైతులు  టిడిపి నేత చంద్రబాబుకు తెలిపారు. ఏక పక్షం గా ఒక చట్టాన్ని రద్దు చేయడం కుదరదు-చంద్రబాబు. రాజధాని రైతుల పోరు 29 వ రోజుకు చేరింది. పండుగ రోజునా అమరావతి కోసం పోరు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు.  పోరాటమే పండుగ నినాదంతో ఇవాళ ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. రైతులకు మద్దతుగా సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న నారా, నందమూరి కుటుంబసభ్యులు బుధవారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు లోకేష్‌ సతీమణి నారా బ్రహ్మణి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఆందోళనలు చేస్తున్న రైతుల వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: