ఆధునిక వసతులతో రాజవైభోగాలు అనుభవిస్తూ ఉండే మానవుడిని మృత్యువు స్నేహితుడి రూపంగా తప్పక పలకరిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇది ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో చెప్పడం మాత్రం కష్టం. కాని ప్రతి మనిషిని మాత్రం ఈ మృత్యువు తనతో పాటుగా తీసుకెళ్లడం మాత్రం ఖాయం. ఇక మనదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా దారుణ సంఘటనలు జరుగుతే వెంటనే ఘటన తాలుకూ విషయాలు తెలుసుకునే శక్తివంతమైన వ్యవస్ద ఈ నాటి మానవుల సొంతం.

 

 

కానీ మరణం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు చేధించలేకపోయారు.. ఇకపోతే అప్పుడప్పుడు అక్కడక్కడ జరిగే ఘోరమైన ఘటనలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేస్తుంది. ఈ ప్రమాదాలు ఏదో చిన్న చిన్నగా ఉండవు. గాని ఇలాంటివి జరిగిన సమయంలో గాని, జరుగుతున్న సమయంలో గాని వీటితాలూకు దృష్యాలు భయంకరంగా ఉంటాయనడానికి ఈ వీడియోను ఉదాహరణగా చెప్పవచ్చూ..

 

 

అదేమంటే చైనాలో రోడ్డుపై వెళుతున్న బస్సు ఉన్నట్టుండి భూమిలో కుంగిపోయింది. ఈ ఘటన చైనాలోని కింగాయ్ ప్రావిన్స్ లో క్సినింగ్ నగరంలో  జరిగింది. ఇకపోతే ఈ ప్రమాదం జరిగే సమయాన అక్కడి నగరంలోని ట్రాఫిక్ చాలా నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో బస్సు ఓ స్టాప్ వద్ద ఆగింది. అంతే అకస్మాత్తుగా అక్కడి భూమి కుంగి పోయింది. రాకాసి నోరులా తెరుచుకున్న ఆ సింక్ హోల్ లోకి బస్సు క్రమ క్రమంగా జారిపోయింది.  

 

 

బస్సుతో పాటుగా ఈ ఘటన చూస్తున్న పాదచారులు సైతం ఆ గుంతలో పడిపోయారు. అంతే కాకుండా అకస్మాత్తుగా బస్సు పక్కనే ఉన్న విద్యుత్ స్థంభం కూలి అగ్నిప్రమాదం కూడా జరిగింది. ఇక ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పదిమంది గల్లంతయ్యారు. మరో 16 మంది క్షతగాత్రులు కాగా ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన చూసిన వారి పరిస్దితి ఎలా ఉందంటే ఏదో ప్రమాదం సంభవిస్తుంది. కానీ అసలు అక్కడ ఏ ప్రమాదం ముంచుకొచ్చిందో అర్ధం కాని పరిస్దితుల్లో అయోమయంలో ఉన్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: