సంక్రాంతి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల క్రాంతులు తీసుకొచ్చింది.  సంక్రాంతికి అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే సంక్రాంతిరోజున దక్షిణాయనం నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణం దిశగా అడుగులు వేస్తారు.  ఈ సమయంలో సూర్యుడు క్రమంగా భూమికి దగ్గరగా వస్తుంటాడు. చలి తీవ్రత కొంతవరకు తగ్గుతుంది. అంతేకాదు,మంచు తగ్గిపోవడంతో ప్రజలు బటయకు వచ్చి పనులు చేసుకోవడానికి వీలు కలుగుతుంది.  అందుకే ఉత్తరాయణ కాలం శుభప్రదమైనది అని చెప్తారు.  


జీవరాసులు అన్ని కూడా తిరిగి తమ పనుల కోసం సమాయత్తం అవుతుంటాయి.  ఇవే కాదు, సంక్రాంతి రోజున వచ్చే సంధ్య సమయానికి చాలా పట్టు ఉంటుంది.  ఈరోజున ఉదయాన్నే శుచిగా స్నానం చేసి, సూర్యునికి అభిముఖంగా కూర్చొని నీటిని తర్పణం విడవాలి.  తమపై దయ ఉంచి కాపాడమని వేడుకోవాలి.  అప్పుడే జీవుడు హ్యాపీగా ఉంటాడు.  అన్నింటికీ మించి జీవులు తమ మనుగడను సాగించేందుకు సమాయత్తం అవుతుంటాయి.  
వెలుగు లేకుంటే మనిషి మనుగడ ఉండదు అన్నది వాస్తవం.

 ఎందుకంటే, మనిషిలో ఎలాంటి చర్య జరగాలి అన్నా కూడా వేడి చాలా అవసరం అవుతుంది.  శరీరంలో వేడి లేకుంటే మనిషి ఎలాగైతే ముందుకు సాగలేడో, అలానే అన్ని రకాల పనులు చేయడానికి వేడి అవసరం అవుతుంది.  ఉత్తరాయణ కాలంలో ఉండే సంధ్య వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  ఆరోగ్యం పరంగా చూసుకుంటే, శరీరానికి కావాల్సిన డి విటమిన్ ను ఎక్కువగా ఈ సంధ్య వలన శరీరానికి చేరుతుంది.  


డి విటమిన్ శరీరానికి ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు.  మనిషి శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే తప్పనిసరిగా వీటి అవసరం ఉన్నది.  శరీరంలో అన్ని రకాల జీవన సౌకర్యాలు దీని వలనే కలుగుతాయి.  ఇలా ఎనో ప్రయోజనాలు మనిషికి దీని వలన కలుగుతుంది కాబట్టి ప్రతి మనిషికి దీని అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.  ఇలా చెప్పుకుంటూ పొతే సంధ్య వలన కలిగే ప్రయోజనాల గురించి ఏకంగా ఓ గ్రంధమే తయారవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: