ప్రశ్నిస్తాను అని చెప్పి రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో చంద్రబాబు కి మద్దతు తెలిపి 2019 ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో అవినీతిని ప్రశ్నిస్తాను అని చెప్పి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమే ఆయనను ఎదుర్కోవడం కోసమే ఆయనను ఇబ్బందుల పాలు చేయడం కోసమే జనసేన పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించి తనను అభిమానించే అభిమానులను వైయస్ జగన్ ని విమర్శించే విధంగా రాజకీయ అడుగులు వేస్తూ ఇన్నాళ్ళు రాణించిన పవన్...తాజాగా ఢిల్లీ పర్యటనలో బిజెపి పార్టీతో చేతులు జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసి రాబోయే రోజుల్లో రాజకీయ అడుగులు వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పై అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

 

గతంలో చిరంజీవి ని నమ్ముకుంటే అర్ధాంతరంగా ఎవరికీ చెప్పకుండా ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో కలిపేశారు. ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తున్నారు అంటూ విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అంతే కాకుండా రెండు చోట్ల ఓడిపోయిన సందర్భంలో మీ వల్లే నేను ఓడిపోయాను అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమానుల పై ఫైర్ అయిన కామెంట్లను తాజాగా అభిమానులు ప్రస్తావిస్తూ...ఎప్పుడు మెగా కుటుంబానికి అండగా ఉండే అభిమానులు రాజకీయంగా కూడా అండగా ఉంటున్న రాజకీయంలో చేత కాకుండా ఇష్టానుసారం అయిన నిర్ణయాలు తీసుకుంటే ఎవరూ కూడా వెనకాల ఉండి సపోర్ట్ చేయరు మద్దతు తెలిపారు...అయినా ఓడిపోయినా గాని వెనకాలే ఉంటూ అండగా ఉంటున్న ఇష్టానుసారంగా బిజెపి పార్టీలో జనసేన పార్టీని కలిపే విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయటం దారుణమని అభిమానులు విమర్శలు చేస్తూ ఉన్నారు.

 

ఢిల్లీలో ఉండే నాయకులకు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు గులాంగిరి చేస్తారని గతంలో కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీని ఢిల్లీ లో కేంద్రంలో చక్రం తిప్పుతున్న బిజెపి పార్టీలో కలిపేయడం పవన్ కళ్యాణ్ చేతగాని రాజకీయ తనానికి నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ నీతో నడవాలి అంటే నీకు దండం బాబు అంటూ పవన్ కళ్యాణ్ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: