పూరీ జగన్నాథ్ సినిమాలో హీరోలకు కొంచెం తిక్క ఉంటుంది. ఎక్స్ ట్రీమ్ గా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి డైరెక్టర్ కు విజయ్ దేవరకొండ తగిలితే ఎలా ఉంటుంది. వాళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే హీరోయిజం ఏ లెవల్ ఉంటుంది. ఊహే కొంచెం క్రేజీగా ఉంది కదా. ఆ మ్యాడ్ నెస్ ని చూపించేందుకే డేట్ ఫిక్స్ చేశాం అంటోంది చార్మి. 

 

పూరీజగన్నాథ్ స్కూల్ లో జాయిన్ అయితే ఎలాంటి హీరో అయినా మారిపోవాల్సిందే. ఫ్యామిలీ హీరో అయినా.. లవర్ బాయ్ అయినా.. ఎవరైనా సరే పూరీ మార్క్ డైలాగులు పేల్చాల్సిందే. అలాంటిది బోల్డ్ స్పీచ్ లతో యూత్ ని మాయ చేసే విజయదేవరకొండ దొరికితే పూరీకి కొత్త ఉత్సాహం వస్తోంది. అలాంటి ఎనర్జీతోనే ఫైటర్ ని డిజైన్ చేస్తున్నాడు పూరీ. 

 

పూరీజగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఫైటర్ అనే సినిమా తెరకెక్కుతోంది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ ని చాలా కొత్తగా చూపించబోతున్నాడట పూరీ. ఈ క్యారెక్టర్ కోసమే థాయిలాండ్ లో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు విజయ్. 

 

ఫైటర్ రెగ్యులర్ షూటింగ్ జనవరి 20 నుంచి స్టార్ట్ కాబోతోంది. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు నిర్మాతలు. కరణ్ జోహార్ తో కలిసి పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. సో ఈ మూవీతో విజయ్ పాన్  ఇండియన్ స్టార్ గా మారుతున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ.. మాస్ అండ్ రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు. పూరీ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ లో ఒదిగిపోనుండటంతో ఆయన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: