తెలుగు సినీ పరిశ్రమలో ఉదయ్ కిరణ్ ను ఎంతమంది ఆదరించారు...? ఉదయ్ కిరణ్ తో సినిమా చేసేందుకు ఎంత మంది ముందుకొచ్చారు..? టాలీవుడ్ ఆదరించలేదు కనుకే..తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లాడా..? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు సగటు తెలుగు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. నిజానికి ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవి చేసిన పొరపాటు ఏదైనా ఉందంటే.......అది ఎంగేజ్ మెంట్ క్యాన్సెల్ చేయడం మాత్రమే. దానికి కారణాలేవైనా కావచ్చు.. చిరంజీవికి.. ఉదయ్ కిరణ్ చాలా చిన్న విషయమని అతడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదంటున్నారు చిరు ఫ్యాన్స్. 'ఉదయ్ కిరణ్ కు అవకాశాలు లేకపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శక నిర్మాతలు కారణం అయి ఉండొచ్చు. చిరంజీవితో ఉదయ్ కిరణ్ సంబంధాలు బెడిసికొట్టడంతో ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు ఆటోమెటిక్ గా ఉదయ్ ను పక్కన పెట్టారు. ఉదయ్ తో సినిమా చేస్తే ఎక్కడ చిరంజీవి నొచ్చుకుంటారో, ఎక్కడ తమకు అవకాశాలు ఇవ్వరేమోనన్న అనవసర ఆలోచనలే కారణంగా తెలుస్తోంది. మధ్యలో ఉన్న వారి అత్యుత్సాహం వల్లే ఉదయ్ కిరణ్ కు ఆఫర్స్ రాలేదు.' అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత పెద్దపెద్ద మాటలు అంటున్న వాళ్లలో... ఏ ఒక్కరు కూడా ఎందుకు అతడికి అవకాశాలు ఇవ్వలేదని చిరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా ఉదయ్ కిరణ్ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఎవరి అక్కసు వాళ్లు వెల్లగక్కడం కరెక్ట్ కాదంటున్నారు. మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమ ఒక నటుడిని కోల్పోయిన విషాద సమయంలో...సినీ ప్రముఖులు ఎవరి ఇష్టానికి వాళ్లు మాట్లాడం ఎంత వరకు కరెక్ట్....?

మరింత సమాచారం తెలుసుకోండి: