టీటీడీ శ్రీవారి భక్తులకు ఒక శుభవార్త చెప్పింది. టీటీడీ గదుల బుకింగ్ విధానంలో కీలక మార్పులను చేసింది. భక్తులు కాషన్ డిపాజిట్ చెల్లిస్తే మాత్రమే ఇకపై అద్దె గదులను బుక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో గదులు బుక్ చేసుకునే సభ్యులు బుకింగ్ చేసుకునే సమయంలోనే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్ ను భక్తులు గదులను ఖాళీ చేసిన తరువాత తిరిగి ఇచ్చేస్తారు. 
 
జనవరి నెల చివరి వారం నుండి ఈ విధానం అమలులోకి రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్ బుకింగ్ చేసేవారు కూడా కాషన్ డిపాజిట్ చెల్లించాలి. టీటీడీ ఈ కొత్త రూల్ ను అమలులోకి తీసుకొనిరావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయని చెబుతోంది. శ్రీవారి భక్తులకు మేలు చేయటం కొరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చెబుతోంది. కొంతమంది గదులను ఆన్ లైన్ లో బుక్ చేసుకొని తిరుమలకు రాకపోవడంతో ఆ గదులు మిగిలిపోతున్నాయి. 
 
అందువలన శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ సమయంలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉన్నట్టు గుర్తించటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వారి భక్తులకు ఈ నిర్ణయం శుభవార్త అనే చెప్పవచ్చు. ఈ నిర్ణయం అమలు వలన భక్తులు బుకింగ్ విషయంలో జాగ్రత్త వహించే అవకాశం ఉంది. అధికారులు ఈ నిబంధన మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
గదుల బుకింగ్ విషయంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా గదులు వృథా కావని కాషన్ డిపాజిట్ వెనక్కు ఇచ్చేస్తారు కాబట్టి ఏ సమస్య ఉండదని అధికారులు భావిస్తున్నారు. టీటీడీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందో చూడాలి. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: