ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా వికేంద్రీకరణ జరగాలని మూడు చోట్ల రాజధాని అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన ఈ ఆలోచన పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి ప్రాంతం నుండి వైయస్ జగన్ రాజధానిని తరలించే కార్యక్రమం చేస్తున్నారని కామెంట్ చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఆందోళనలు నిరసనలు వారి వారితో పాటు చేస్తున్నారు.

 

అయితే ఇక్కడ అసలైన పాయింట్ ఏమిటంటే అమరావతి ప్రాంతంలో రాజధాని అలాగే కంటిన్యూ అవుతూ అసలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో లక్షలు పెట్టి రాజధాని నిర్మించడం అంటే ఇప్పటికి ఇప్పుడు పని చేయడం చాలా కష్టంతో కూడిన శ్రమ ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతమైన వైజాగ్ లో రాజధానిని విస్తరించి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరియు అదే విధంగా వెనుకబడిపోయిన పేరు ఉన్న రాయలసీమ ప్రాంతం కర్నూలులో హైకోర్టు పెట్టుకొని రాష్ట్రం మొత్తం కలిసి ఉండేలా ఒక చోట మాత్రమే అభివృద్ధి అన్నది లేకుండా హైదరాబాదులో వచ్చిన నష్టం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు రాకుండా వైయస్ జగన్ అమరావతి ప్రాంతంలో రాజధానిని కొనసాగించి మిగతా రెండు చోట్ల వైజాగ్ మరియు కర్నూల్ లో రాజధానిని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే ...రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చాలా నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుందని  భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఎకరానికి రూ.5 నుంచి రూ.8 కోట్ల మధ్య పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెబుతన్నారు. అదే జరిగితే రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారమే రూ.1.89 లక్షల కోట్లు ఉంటుందన్నది సుజనా మాట. మొత్తంమీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై రెండు లక్షల కోట్లు భారం పడుతుందని సుజనా చౌదరి పేర్కొన్నారు. కానీ మూడు వేల కోట్లు పెడితే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో తుది దశలో ఉన్న నిర్మాణాలు పూర్తవుతాయని జగన్ కి సలహా ఇచ్చారు. మరి సుజనా చౌదరి చెప్పిన మాట ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉన్న అమరావతి ప్రాంతంలో మూడు వేల కోట్లు అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు కాబట్టి సుజనాచౌదరి సలహా మేరకు జగన్ ఓకే అయితే జగన్ నెత్తిపై సుజనా చౌదరి పాలు పోసినట్లు అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: