దక్షిణాది రాజకీయాల్లో ఏదో విధంగా బలంగా నాటుకు పోవాలని ఉత్తర భారతం లో ఉన్నట్టు పార్టీని దక్షిణ రాష్ట్రంలో కూడా విస్తరించాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన బిజెపి పార్టీకి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మెల్లమెల్లగా బిజెపి పార్టీ పై వ్యతిరేకత వస్తున్న తరుణంలో మహారాష్ట్రలో చేతిదాకా వచ్చిన అధికారం కోల్పోయి ఢిల్లీలో ఏదో విధంగా గెలవాలని ప్రయత్నాలు చేసిన బీజేపీకి దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో కొద్దోగొప్పో ఆదరణ ఉన్న ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప రాజీనామా చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు.

 

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఎన్నికయి సంవత్సరం గడవకముందే కర్ణాటక బిజెపి సీఎం ఎడ్యూరప్ప కి పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మంత్రి పదవుల కోసం తీసుకు వస్తున్న ఒత్తిడిపై తట్టుకోలేక ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి ఎడ్యూరప్ప సిద్ధమైనట్లు సమాచారం. ఏకంగా ఒక స్వామీజీ ఇటీవల సీఎం కు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎదురయింది మంత్రి పదవుల విషయంలో. క్షుణ్నంగా విషయంలోకి వెళితే ఎడ్యూరప్ప సామాజిక వర్గమైన లింగాయిత్ లలో పలుకుబడి ఉన్న స్వామీ వచానంద్. ఆయన ముఖ్యమంత్రి యడ్డీ వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు. 

 

బీజేపీ ఎమ్మెల్యే మురుగేష్ కు మంత్రి పదవి ఇవ్వాలని లేదంటే లింగాయిత్ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఓపెన్ గానే హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సదరు స్వామీజీ.. యడ్డీకి వార్నింగ్ ఇచ్చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ అనేది ఎడ్యూరప్ప చేతిలో లేకపోవడంతో మరోపక్క అధిష్టానానికి కూడా తన ఒత్తిడి చెప్పుకోలేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఎడ్యూరప్ప ఉన్నట్లు కర్ణాటక రాజకీయాల్లో వార్తలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. దీంతో బిజెపి పార్టీ పెద్దలు ఈ విషయంలో రంగంలోకి దిగి కర్ణాటక రాజకీయాల్లో బీజేపీలో తలెత్తిన సమస్యలు పరిష్కరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: