సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో  సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలోని సంక్రాంతి సంబరాలు ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తుంటాయి. అందుకే చాలామంది తెలుగు రాష్ట్రాల్లో కి వచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా ఉంటాయి. వ్యాపార ఉద్యోగం  నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లినవారు సొంతూళ్లకు చేరుకుని సందడి చేయడం... కొత్త అల్లుళ్లు అత్తారింటికి చేరుకొని సందడి చేస్తుండటంతో ఆ సంబరాలకు మరింత జోరు పెరుగుతోంది. 

 

 

 ఇక సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది రంగవల్లులు గంగిరెద్దులు గొబ్బెమ్మలు ఎటుచూసినా పండగ వాతావరణం సాంప్రదాయ శోభ  కనిపిస్తుంది. అయితే వీటితో పాటు అందరికీ సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది కోడిపందాలు గుండాటలు. సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల జోరు భారీగా పెరుగుతోంది. ఇక ఉభయగోదావరి జిల్లాలో కోడిపందాల జోరు మామూలుగా ఉండదు. అయితే కోడిపందాలను నిర్వహించద్దు అని  ఓవైపు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు కోడి పందాలు నిర్వహిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ... ప్రజలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా అని హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కోడిపందాలను నిర్వహిస్తున్నారు . 

 

 

 ఇక ఈ కోడి పందేలను చూడడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక కోడి పుంజులుపై  పందెం కాయడానికి పక్క రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. 10వేల నుంచి 10 లక్షల కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. భోగి ఒక్క రోజు నాడే వంద కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా. సంక్రాంతి కనుమ రోజుల్లో కోడిపందాల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ కోడిపందాల నేపథ్యంలో మూడు రోజుల్లో కలిపి ఉదయ గోదావరి జిల్లాలో ఏకంగా 500 కోట్ల వరకు లావాదేవీలు జరిగే అవకాశం ఉందని పలువురు  అంచనా వేస్తున్నారు. చూడాలి మరి కోడిపందాలు జోరు  ఎంతల చూపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: