రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్లేసులో విశాఖపట్నంను ఏర్పాటు చేసుకోవటం జగన్మోహన్ రెడ్డికి చాలా తేలికే. కానీ విశాఖను రాజధానిగా మార్చుకున్న తర్వాతే జగన్ కు అసలైన సవాళ్ళు మొదలవుతాయనటంలో సందేహం లేదు. విశాఖపట్నంకు రాజధానిని మార్చినంత తేలిక కాదు అక్కడి నుండి సక్రమంగా పరిపాలించటం. ఎందుకంటే అడుగడుగునా జగన్ కు చంద్రబాబునాయుడు తో పాటు ఎల్లోమీడియా అడ్డం పడుతునే ఉంటాయి కాబట్టి.

 

విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఏ చిన్న సంఘటన  జరిగినా  జగన్ చేతకాని తనం వల్లే జరిగిందనే విష ప్రచారం చేయటానికి ఎల్లోమీడియా+చంద్రబాబు రెడీగా ఉంటారు. రాజధానిగా విశాఖపట్నం అంటేనే ఉత్తరాంధ్ర వాళ్ళు భయపడిపోతున్నారనే ప్రచారాన్ని ఇపుడు చంద్రబాబు పదే పదే చేస్తున్నది ఇందులో భాగమనే అనుకోవాలి. చంద్రబాబు బుర్రతక్కువ తనం కాకపోతే రాజధానిగా పెడతామంటే ఏ ప్రాంతం వాళ్ళైనా వద్దంటారా ?

 

జగన్+వైసిపికి సంబంధించిన విషప్రచారాన్ని 2014 ఎన్నికల్లో  విజయమ్మ విశాఖపట్నం ఎంపిగా పోటి చేసినపుడే మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులూ రాయలసీమ గుండాలు, పులివెందుల రౌడీలు అల్లరి చేస్తున్నారని, భూక్బాలు మొదలుపెట్టారంటూ అప్పట్లో ఎల్లోమీడియా సహకారంతో చంద్రబాబు ఎంతగా విషం కక్కారో అందరూ చూసిందే.

 

ఇపుడు కూడా ఇటువంటి ప్లాంటెడ్ స్టోరీలే తమ ఎల్లోమీడియాలో రాయిస్తున్నారు. ఇక ముందు ఇంకా ఎక్కువగా రాయించటానికి ఏమాత్రం మొహమాటపడరు. పరిపాలనలో జగన్ విఫలమయ్యాడని చాటి చెప్పటానికి ప్రతిరోజు వీళ్ళు రాళ్ళేస్తునే ఉంటారు. కాబట్టి శాంతి భద్రతల విషయంలో కానీ ఇతరత్రా విషయాల్లో కానీ జగన్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్ గా ఉంటారు. అదే సమయంలో అమరావతి ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని చేయటమే కాకుండా ఉద్యోగ, ఉపాధిని  చూపించగలిగితేనే  జగన్ సక్సెస్ అయినట్లు. లేకపోతే  ఎల్లోమీడియా విషప్రచారానికి బలైపోవాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: