సంక్రాంతి పండుగ హీరోలకు ప్రజలకు ప్రతిష్ఠాత్మకమైనదే కాదు... ఇక్కడ ఓ నాయకుడికి  కూడా ఈ సంక్రాంతికి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఆయన నాయకత్వంలో ఇప్పుడు వరకు అన్నీ కూడా ఓటములే. ఆయన నాయకత్వంలో ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలు  జరిగినప్పటికీ కూడా ఒక దాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఇక ఈ నెలలో జరుగుతన్న  మున్సిపల్ ఎన్నికలు  ఆయన నాయకత్వంలో చివరి ఎన్నికలు. దీంతో పురపాలక ఎన్నికలలో విజయం సాధించి నాయకత్వం నుంచి దిగిపోవాలి అనుకుంటున్నారు ఆ  లీడర్. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు అనుకుంటున్నారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో మున్సిపల్ ఎన్నికలు ఆ నాయకుడికి ప్రతిష్టాత్మకంగా మారాయి. 

 

 

 ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించిన టీ పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... పురపాలక ఎన్నికలు అయిపోయిన తర్వాత టిపిసిసి సింహాసనం నుంచి దిగి పోతాను అంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ పోరు లో ఏమాత్రం సత్తాచాట లేకపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏకంగా పిసిసి చీఫ్ పదవుల్లో ఉన్నప్పటికీ కూడా తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న  నియోజకవర్గంలో తన భార్యను  సైతం గెలిపించుకోలేని డీలా  పడిపోయారు. దీంతో పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్  సరైనవాడు కాదని... ఉత్తంకుమార్ రెడ్డి తప్పుకోవాలని డిమాండ్ కూడా వినిపించాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల తర్వాత టిపిసిసి పద్ధతి మార్పు తప్పనిసరి అని అర్ధమైపోయింది. ఇక కుమార్ రెడ్డి నాయకత్వంలో చివరి ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలే. 

 

 

 అయితే మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వక ముందు నుంచి తీవ్ర కసరత్తులు చేస్తోంది. పార్టీ నాయకులు అందరికీ దిశానిర్దేశం చేయడం.. గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేయడం లాంటివి వాటిపై  ఎన్నో రోజుల నుండి టిఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఓడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం నుంచి తప్పుకోవాల్సి ఉండడంతో.. ఉత్తమ్  మున్సిపల్ ఎన్నికలపై తక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. కేవలం అడపాదడపా జిల్లా నాయకులతో మాట్లాడి సత్తా చాటాలని ఉత్తమ్కుమార్ రెడ్డి  కోరుతున్నట్టు సమాచారం. మొత్తానికి అయితే మున్సిపల్ పోరు లో గెలిచిన ఓడిన టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్  దిగిపోవడం ఖాయమని అర్థమైపోయింది. కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో విజయం తో గౌరవప్రదంగా టీపీసీసీ చీఫ్ పదవి నుంచి దిగిపోవాలి అన్నది ఉత్తంకుమార్ రెడ్డి ఆలోచన. మరి దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొని కాంగ్రెస్ సత్తా చాటుతున్నదా  లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: