దేశ‌మంతా సంతోషించే వార్త విష‌యంలో...మ‌రో ఉత్కంఠ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇంకా చెప్పాలంటే ఒకింత దుర్వార్త అనుకోవ‌చ్చు. ఈనెల 22వ తేదీ  ఉదయం 7 గంటలకు నలుగురు నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన విషయం విదితమే. అయితే, ఈ ఉరి శిక్ష మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తమకు ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దోషులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. దీంతో క్షమాభిక్ష కోరుతూ ముకేష్ అనే దోషి.. రాష్ర్టపతి కోవింద్ కు అభ్యర్థన పెట్టుకున్నాడు. 

 

ముకేష్ అనే నిందితుడు రాష్ర్టపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.నిర్భయ దోషుల డెత్ వారెంట్ నిలపుదల చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తప్పనిసరైతే కింది కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఒక్కో దోషికి ఒక్కో రకం నిబంధనలు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారని కోర్టు ప్రశ్నించింది. 2017లోనే సుప్రీంకోర్టు అప్పీళ్లను తిరస్కరించింది. ఇప్పటి వరకు క్షమాభిక్ష పిటిషన్లు ఎందుకు పెట్టుకోలేదని కోర్టు అడిగింది. ఒక్కో దోషికి ఒక్కో నియమం ఉండదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

 

అయితే జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్షపై రాష్ర్టపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత దింగ్రా సెహగల్ కు ఢిల్లీ ప్రభుత్వం వివరించింది. ఒక వేళ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ర్టపతి తిరస్కరించినా.. నిబంధనల ప్రకారం దోషులను ఉరితీయడానికి ముందు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని తీహార్ జైలు అధికారులు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో నలుగురు దోషుల ఉరిశిక్ష మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: