ఊరు ఊరంత సంబరాలు, నగరం నుండి కూడా ఎందరో పల్లె వాతవరణంలో రసవత్తంగా జరిగే పందాలను చూద్దామని వెళ్లారు. ఇక అందరి పండగ అయినా సంక్రాంతి కి నగరాలు అన్ని బోసిపోయాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ కోడి పందాల నిర్వహణ ఏపీలో కాక రేపుతోంది. ఎందుకంటే కోడి పందాల నిర్వహణ చట్ట ప్రకారం నేరమని, దాన్ని అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించినా ప్రజలు పట్టించుకోవడం లేదు.

 

 

ఇకపోతే తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. లక్షలు ఖర్చు చేసి పందెం బరులను తీర్చిదిద్దారు. కృష్ణా జిల్లా బందరు, గన్నవరం సహా కొన్ని ప్రాంతాల్లో భోగి నాడే కోడిపందాలు మొదలవగా, మిగతా ప్రాంతాల్లో ఇవాళ ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి.. ఇదే కాకుండా తూర్పుగోదావరిలో అయితే పలుచోట్ల క్రికెట్‌ స్టేడియం మాదిరిగా ఏర్పాట్లు చేసి, గ్యాలరీలు పెట్టి పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారట, అంతే కాకుండా ఫ్లడ్‌లైట్లను ఏర్పాటుచేసి రాత్రి సమయాల్లోనూ ఈ పందాలు నిర్వహిస్తున్నారు..

 

 

ఇక ఈ పందాల్లో 10వేల నుంచి10 లక్షల రూపాయల వరకు బెట్టింగ్ జరుగుతుందట. ఇంతలా ఆనందోత్సవాల మద్య జరుపుకుంటున్న ఈ పండగలో ఒక చోట అపశృతి చోటు చేసుకుంది.. అదేమంటే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో కోడిపందాలు జరుగుతుండగా, ఓ వ్యక్తి కి,  కోడికత్తి బలంగా తగలడంతో మరణించాడు.

 

 

మృతుడు ప్రగడవరానికి చెందిన చిన వెంకటేశ్ (40) గా గుర్తించారు. సాధారణంగా కోడిపందాల్లో కోడిపుంజు కాలికి కట్టే కత్తులు ఎంతో పదునుగా ఉంటాయి. వాటిని నిపుణులైన వ్యక్తులతో మాత్రమే కోడి కాళ్లకు కట్టిస్తుంటారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా తీవ్ర గాయాలపాలవుతారు. ఒక్కోసారి ఇదిగో ఇలా ప్రాణాలు కూడా పోవచ్చూ.. ఏది ఏమైన పండగ సమయాన ఒక నిండు ప్రాణం బలి అవ్వగా, ఆ ఇంటిలో విషాదం నిండింది.

మరింత సమాచారం తెలుసుకోండి: