సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి అన్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది కోడిపందాలు గుండాటలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే జోరుగా కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. కోర్టులు పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కోడిపందాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ప్రజాప్రతినిధులు కూడా కోడిపందాల్లో  పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు కోడిపందాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడిపందాలు జోరందుకున్నాయి. కాగా ఈ కోడి పందాల్లో తెలంగాణ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 

 

 

 ఉభయగోదావరి జిల్లాల్లోని ఏలూరులో కోడిపందాల్లో బంధువులతో కలిసి సందడి చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడిపందాలు జూదం లాంటిది కాదని... సాంప్రదాయంగా పురాతన కాలం నుంచి వస్తున్నాయి అంటూ తలసాని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాజకీయాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని. 2019 ఎన్నికల్లో విజయం సాధించినట్లుగానే వైఎస్ఆర్సిపి పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధిస్తుంది అని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా రాజధాని మార్పు పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తలసాని. 

 

 

 గత ప్రభుత్వ తప్పిదం వల్లే ఇప్పుడు రాజధాని మార్చాల్సిన అవసరం వచ్చిందని.. రాజధాని విషయంలో శాశ్వత పరిష్కారం ఉండాలని సూచించారు. ప్రభుత్వం తో ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన సూచించారు ప్రభుత్వంతో ఉండండి ప్రభుత్వాన్ని నమ్మండి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మామూలు వ్యక్తి కాదని ఆకలి బాధలు తెలిసిన వ్యక్తి అని ... దేన్నీ  నిర్దాక్షిణ్యంగా తీసివేయరని  రైతులతో చర్చించిన తర్వాతే రాజధాని మార్పు చేస్తారు అంటూ తలసాని వ్యాఖ్యానించారు. జోలు  పట్టుకునే వాళ్ళ వెంబడి వెళితే గోదారిలో ఈదడానికి కుక్క తోక పట్టుకున్నట్లే  అంటూ తలసాని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: