ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన ఇండియాలోనే ఉంది అని మీకు తెలుసా ? అసలు ఎక్కడ ఉందొ తెలుసా ? తెలియదు.. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు ఏది అంటే.. ఇండియన్ రైల్వే. అయితే ఇండియన్ రైల్వే వంతెనను జమ్మూ కాశ్మీర్ లోని చెనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. 

 

ఇది కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. ఇది పారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన పొడవు దాదాపు 1.3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్వే వంతెన ప్రాజెక్టును కొంకణ్ రైల్వే నిర్మిస్తోంది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకు 1,400 మంది శ్రామికులు పనిచేస్తున్నారు.                    

 

అయితే ఈ వంతెన నిర్మాణం 2004 లో ప్రారంభమవ్వగా మధ్యలో అధిక గాలుల కారణంగా 2008లో పోస్టుపోన్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ వంతెనను ఇప్పుడు తిరిగి నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకోగలదని ఓ సీనియర్ అధికారి ఇటీవలే తెలిపారు.               

 

కాగా ఈ వంతెన జీవిత కాలం 120 సంవత్సరాలు ఉంటుందని ఓ ప్రముఖ సీనియర్ అధికారి చెప్పారు. కాట్రా, బనిహాల్ ప్రాంతాల మధ్య ఈ వంతెన కీలక మార్గం కానుంది. అంతేకాదు ప్రపంచంలోనే నదికి రెండు పక్కల మాత్రమే సపోర్ట్ చేసుకుని.. మధ్యలో ఏ సపోర్ట్ లేకుండా ఉన్న వంతెనల్లో ఇది ఏడోది. ఏది ఏమైనప్పటికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన మన భారత్ లో ఉండటం విశేషం.                    

మరింత సమాచారం తెలుసుకోండి: