ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎందుకు కొనసాగించాలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తేల్చి చెప్పేశారు . అమరావతి కాకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు భారీ ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు . 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు ఎంతలేదన్నా ఐదు నుంచి ఎనిమిది కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని , ఈ మొత్తం 1 .89 లక్షల కోట్లు ఉంటుందని సుజనా చెప్పుకొచ్చారు .

 

ఒక్క రైతులకే కాకుండా అమరావతి బాండ్లు కొనుగోలు చేసిన వారికి, ఇతరత్రా ఒప్పందాలు చేసుకున్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం  నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని ...మొత్తంగా రెండు లక్షల కోట్ల రూపాయలు  చెల్లించాల్సి  ఉంటుందని  సుజనా లెక్కలు కట్టారు . ఈ మొత్తాన్ని ప్రస్తుతమున్నఆర్ధిక  పరిస్థితుల్లో చెల్లించడం అంతఆషామాషి వ్యవహారం కాదని చెప్పుకొచ్చారు . మూడు రాజధానుల స్థానం లో అమరావతినే రాజధానిగా కొనసాగించి , మరో మూడు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తుది దశలో ఉన్న నిర్మాణాలన్నీ పూర్తి అవుతాయని తన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ సుజనా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాశారు . అయితే జగన్మోహన్ రెడ్డి , సుజనా లేఖను ఎంతమాత్రం పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి .

 

ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒకే చెప్పడమే కాకుండా , హైపవర్ కమిటీ నివేదిక అందగానే కేబినెట్ భేటీ లో ఆమోదించడమే తరువాయి అన్నట్లు చకచకా అడుగులు వేస్తోంది . ఇక రాజధాని రైతులకు గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని మంత్రులు పేర్కొంటున్నారు . అంతకాదంటే తమ డిమాండ్లు ఏమిటో చెప్పాలని కోరుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: