జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత.. కానీ ఈయన మాటలు ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటాయి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు ఆయన పండుగ వేళ మందడం గ్రామానికి వచ్చారు. అక్కడ రైతుల ఉపవాసదీక్షలకు సంఘీభావం ప్రకటించారు. అక్కడ తెలుగుదేశం నేతలతో పాటు కొద్దిసేపు కూర్చున్నారు.

 

ఆ తర్వాత తన వంతు వచ్చేసరికి ఇక మైక్ అందుకున్నారు. అయితే ఆయన చెప్పిన మాటలు అందరినీ షాక్ కు గురి చేశాయి. ఆయన ఏమన్నారంటే.. అవునయ్యా అవును.. ఈ ప్రాంతంలో కమ్మ వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మిగిలిన వాళ్ల కంటే.. మీ కమ్మ వాళ్ల దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది.. అదీ ఎందుకు ఉందంటే.. మీకు కృష్ణా, గోదావరి నదులు ఉన్నాయి. అందువల్ల మీ దగ్గర డబ్బు పోగుపడి ఉంది. అయితే ఏంటి..?

 

చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా భూములు కొంటారు. అలాగే మీరూ కొన్నారు. అయితే ఏంటి.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. రాజధాని ఎక్కడొస్తుందనే విషయం కాస్త తెలిసిన వాళ్లు ముందే భూములు కొని ఉంటారు. అందులో తప్పేముంది.. మా రాయల సీమ వాళ్లు కూడా ఒకరిద్దరు కొన్నారట. ఇలా కొన్న వాళ్లు ఎంత మంది ఉంటారు.. మహా అయితే ఓ రెండు వందల మంది ఉండి ఉంటారు.

 

అయితే మాత్రం ఏంటి. వీళ్లు మహా అయితే ఓ 20 వేల కోట్లకు లాభపడి ఉంటారు. అంతే కదా.. దీంతో వచ్చిన నష్టం ఏంటి.. ఇప్పుడు ఎందుకు రాజధాని మార్చాల్సివస్తోంది. ఇప్పుడు విశాఖలో రాజధాని వస్తుందని వైసీపీ వాళ్లకు ముందే తెలియలేదా.. వాళ్లు వైజాగ్ లో భూములు కొనడం లేదా.. ఇలా సాగింది మన జేసీ గారి ప్రసంగం. అది విని టీడీపీ వాళ్లే షాకయ్యారు. ఓరి నాయనో ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని పక్కకు వెళ్లి జుట్టుపీక్కున్నారు. మరి జేసీ దివాకర్ రెడ్డా మజాకా.. మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: