ఏపీ రాజధాని అమరావతి కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. ఏకంగా జోలె పట్టుకుని వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. అయితే ఈ జోలె పట్టుకుని విరాళాలు అడగడంపై అనేక కామెంట్లు వస్తున్నాయి. ఇదందా ఓ పెద్ద డ్రామా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. ఆయన ఏమంటున్నారంటే.. ” రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జోలె పట్టుకుని మరో డ్రామాకు తెరతీశారు. “

 

" భోగిమంటల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోలు, బోస్టన్, జీఎన్ రావు కమిటీ రిపోర్టులు కాలబెట్టడం దుర్మార్గం. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు బినామీలతో భూములు కొనుగోలు చేయించారు. అధికార వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతిస్తున్నారని, చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ధర్నా చేస్తున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా కేసుల కారణంగా హడావుడిగా అమరావతి వచ్చారు" అని ఆమంచి ఎద్దేవా చేశారు.

 

" అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హృదయాలు గెలుచుకున్నారు. చంద్రబాబును, టీడీపీని గత ఎన్నికలలో ప్రజలు బంగాళా ఖాతంలో కలిపేశారు. దోపిడి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. లోకేష్‌ను సైతం ఓడించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలు 151 సీట్లతో వైయస్‌ జగన్‌ను గెలిపించారు. మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజలు తీర్పును అగౌరపరిచినట్లే. సీఎం రమేష్, సుజనాచౌదరి బీజేపి కండువాతో టీడీపీ ఎజెండా ఎత్తుకున్నారు. బీజేపిలోకి పంపించిన బినామీలతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికలలోకు వెళ్లాలి.” అన్నారు ఆమంచి కృష్ణమోహన్.

 

ఆర్థికమూలాలు పోతున్నాయని చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారు. అందుకే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. భవిష్యత్తులో చంద్రబాబు ఎంతమంది పోలీసులను వెంటబెట్టుకున్నా.. రాష్ట్రంలో తిరగలేని పరిస్దితిని కొనితెచ్చుకుంటున్నారు. అది స్వయంకృతాపరాధం. అమరావతిని ముంపు ప్రాంతంగా శివరామకృష్ణ కమిటీ తేల్చిచెప్పింది. చెన్నై ఐఐటీ నిపుణులు కూడా అదే చెప్పారు. సీబీఐకి అనుమతి రాగానే చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నారు.. అంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.

మరింత సమాచారం తెలుసుకోండి: