ఇటీవల ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత ఇకపై రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని రెండు పార్టీల నాయకులు ప్రకటించారు. అంతా జనసేనను బీజేపీలో పవన్ కలిపేస్తారని అంతా ఊహించారు. అందుకే పవన్ తరచూ ఢిల్లీ వెళ్తున్నారని ఊహాగానాలు చేశారు. కానీ అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు మాత్రమే ఒప్పందం చేసుకుని ఏపీకి వచ్చేశారు.

 

అయితే.. ఎలాంటి వార్తనైనా సరే.. చంద్రబాబుకు అనుకూల కోణంలోనే చూసే ఓ తోక పత్రికకు ఈ వార్త పరమాద్భుతంగా తోచింది. ఇంతటి ఘనమైన వార్తకు తనదైన శైలిలో కోటింగ్ ఇచ్చి చంద్రబాబుకు అనుకూలంగా రాజకీయాలు మారిపోతున్నాయహో.. అనే రేంజ్ లో కలరింగ్ ఇచ్చి ఓ కథనం ప్రచురించేసింది. ఈ నెల పదహారో తేదీన బీజేపీ, జనసేన పార్టీల అగ్ర నాయకత్వం భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ గురించి ఆలోచించి ఆలోచించి.. వైసీపీ నాయకుల గుండెలు బేజారవుతున్నాయన్న రేంజ్ లో తోక పత్రిక ఓ కథనం ప్రచురించేసింది.

 

ఇటీవల తాను ఏమనుకుంటారో దాన్నే వార్తగా, విశ్లషణగా రాయడం ఆ తోక పత్రికకు ఓ అలవాటుగా మారింది. అందుకే.. బీజేపీ, జనసేన కలయిక వైసీపీకి ఆశనిపాతం అని ఆ పత్రిక యాజమాన్యం నమ్ముతున్నట్టుంది. అందుకే.. బీజేపీ, జనసేన కూటమిని చూసి వైసీపీ లాగుతడుపుకుంటోందన్న రేంజ్ లో సదరు తోక పత్రిక కలరింగ్ ఇస్తోంది.

 

ఈనెల పదహారు న రెండు పార్టీలకు సంబందించి కలిసి పనిచేయడంపై ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. జగన్ దూకుడును కట్టడి చేయాలంటే కమలం పార్టీతో జట్టుగా వెళ్తే మంచిదని పవన్ భావిస్తున్నట్టున్నారని సదరు తోక పత్రిక తెలిపింది.

 

అందుకే పవన్ బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారట. రాష్ట్ర పరిస్థితులను వాళ్లకు వివరిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తుండటంతో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బెటర్ అనే అభిప్రాయం కూడా రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతోందట. ఈ రెండు పార్టీలను చూసి వైసీపీ గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ఇదీ సదరు పత్రిక పచ్చపాతం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: