భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యయనం మొదలవుతుంది. అదేమంటే మన దేశంలో ఉరితీయడమనేది సామాన్యంగా జరుగదు. కాని ఒకే సారి నలుగురు నిందితులను ఉరికంభం ఎక్కించెందుకు రంగం సిద్దమం అవుతుంది. ఇక ఒకనాడు దేశస్వాతంత్రం కోసం ఉరికంభం ఎక్కితే నేడు దేశానికి ఉరితాడు బిగించారు. మానవత్వాన్ని మరచి, రాక్షసుల్లా ప్రవర్తించే మానవ మృగాలు రెచ్చిపోతుంటే, ఆ కోరలకు బలి అవుతున్న అబలల చావులతో దేశమే ఉరికొయ్యన వేలాడుతుంది..

 

 

ఒకప్పుడు ప్రశాంత వనానికి నిలయమైన ఈ భరతమాత నేడు అరాచాలకు, అన్యాయాలకు, హింసకు నిలయమై దహించుక పోతుంది. ఆ మాత కార్చే ఒక్కొక్క కన్నీటి బొట్టు ప్రళయమై రాబోతుంది. ఇకపోతే అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీ చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్దితిల్లో అర్దరాత్రి కాదు కదా అర్ద పగలు కూడా ఆడది ఒంటరిగా తిరగలేని పరిస్దితుల్లో మనుషులు బ్రతుకుతున్నారు..

 

 

ఇకపోతే డిసెంబర్‌ 2012.. 16వ తేదీ రాత్రి దేశ రాజధాని హస్తినలో కదిలే బస్సులో నిర్భయపై దారుణానికి పాల్పడ్డ రాక్షస మూకకు చావు తేదీ ఖరారైన విషయం తెలిసిందే. నిర్భయపై అతి కిరాతకంగా లైంగిక దాడి చేసి.. ఆమె మరణానికి కారణమైన నలుగురు దోషులకు జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ముఖేశ్‌ సింగ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(31)..

 

 

ఇక ఈ నిందితులు ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడేళ్ల కాలంలో ఈ నలుగురి సంపాదన రూ.1,37,000. ఇందులో అక్షయ్‌ రూ. 69 వేలు సంపాదించగా, పవన్‌ రూ. 29 వేలు, వినయ్‌ రూ. 39 వేలు సంపాదించాడు. ముఖేష్‌ ఎలాంటి పని చేయలేదు. ఇదీ కాకుండా చాలా సార్లు వీరు జైలు నిబంధనలు ఉల్లంగించారు కూడా.. ఇదిలా ఉండగా ఇప్పటికే వీరిని ఉరితీసేందుకు తీహార్‌ జైల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

 

 

ఇకపోతే మన భారతదేశ చరిత్రలో  నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయడం ఇదే తొలిసారి. వీరిని ఉరి తీయడానికి మీరట్‌ నుంచి పవన్‌ జల్లద్‌ అనే వ్యక్తి తీహార్‌ జైలుకు రానున్నారట.. ఇందుకు గాను ఒక్కో ఉరికి ఆయనకు రూ. 15 వేలు చెల్లించనున్నట్లు సమాచారం... 

మరింత సమాచారం తెలుసుకోండి: