నిర్భయ కేసులో నిందితుల గురించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు ఉరి తీయాల్సి ఉన్నా ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉండటంతో ఉరి ఆలస్యమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దోషుల ప్రవర్తన, దోషుల చదువు, మొదలైన విషయాలకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
నిర్భయ కేసు నిందితులు అనేకసార్లు ఢిల్లీలోని తీహార్ జైలు నిబంధనలను అతిక్రమించారని తెలుస్తోంది. నిందితులు చదువుకు సంబంధించిన పరీక్షలలో కూడా ఉత్తీర్ణులు కాలేదని సమాచారం. జైలు వర్గాలు నలుగురు నిందితులు 23సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారని చెబుతున్నాయి. దాదాపు 1,37,000 రూపాయలు వీరు జైలులో ఉండి సంపాదించారని తెలుస్తోంది. నలుగురు దోషులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేష్ లలో వినయ్ 11 సార్లు, అక్షయ్ ఒకసారి నియమాలు ఉల్లంఘించినందుకు వీరిపై జైలు అధికారులు చర్యలు తీసుకున్నారని సమాచారం. 
 
పవన్ ఎనిమిదిసార్లు, ముకేశ్ మూడుసార్లు నిబంధనలను అతిక్రమించినట్టు తెలుస్తోంది. జైలులో ఉన్న సమయంలో ముకేష్ ఎలాంటి పని చేయకూడదని నిర్ణయించుకొని ఎటువంటి డబ్బులు సంపాదించుకోలేదు. అక్షయ్ 69వేల రూపాయలు సంపాదించుకోగా వినయ్ 39 వేల రూపాయలు, పవన్ 29 వేల రూపాయలు సంపాదించుకున్నారు. 10వ తరగతికి మూడు సంవత్సరాల క్రితం అక్షయ్, పవన్, వినయ్ హాజరైనప్పటికీ ఉత్తీర్ణులు మాత్రం కాలేకపోయారు. 
 
వినయ్ నాలుగేళ్ల క్రితం బ్యాచిలర్ డిగ్రీ కోసం పరీక్షలు రాసినా ఆ పరీక్షల్లో వినయ్ పాస్ కాలేదు. దోషులందరి కుటుంబాలకు ఉరిశిక్ష అమలుకు ముందు రెండుసార్లు కలవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నలుగురు నిందితులను మీరట్ కు చెందిన పవన్ జల్లాద్ ఉరి తీయనున్నారు. ప్రస్తుతం దోషులు సీసీ టీవీ పర్యవేక్షణలో వేరు వేరు గదుల్లో ఉన్నారు. జైలు అధికారులు ఇప్పటికే ఉరితీత సన్నాహాల్లో భాగంగా ట్రయల్స్ నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: