మనం టీవీలలో చాలాసార్లు చూస్తుంటాం చిన్నప్పుడే మైనర్ గా ఉన్న సమయంలోనే బాలుడు బాలికకు పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఇవన్నీ పట్టింపులు లేవు. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలంటే చాలా వయసు రావాల్సిందే. కానీ ఇక్కడ ఒక గ్రామంలో ఓ వింత ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు గ్రామస్తులు. మైనర్ లైన ఓ అమ్మాయి అబ్బాయి కి పెళ్లి కాని పెళ్లి జరిపిస్తారు. ఈ వేడుక చూడడానికి గ్రామస్తులంతా తరలి వస్తారు. ఇక ఆ తర్వాత గ్రామస్తులు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. పెళ్లికి వచ్చిన గ్రామస్తులు అందరూ భోజనం చేస్తారు. కానీ అక్కడ పెళ్లి జరిగిన వారికి మాత్రం ఆ తర్వాత సంబంధం ఉండదు. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా ఆనందపురం దుక్కవాని పాలెం గ్రామంలో. 

 

 

 ఈ వింత ఆచారం దుక్కవాని  పాలెం గ్రామంలో అనాధిగా వస్తోందని ప్రజలు చెబుతున్నారు. ఇలా మైనర్ లు  ఇద్దరికీ పెళ్లి చేయడం వల్ల తమ గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే సంక్రాంతి పండుగ పూట అలా పెళ్లి జరిగితే తమ ఊరికి ఎంతో మేలు జరుగుతుందని లేకపోతే కీడు జరుగుతుందని గ్రామస్తులు అంటున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన బాలిక అచ్చియమ్మ భర్త పొలంలో పాము కాటుకు గురై చనిపోగా అప్పటి ఆచారం ప్రకారం... భార్య కూడా సతీసహగమనం పాటించి భర్తతో పాటే చితిలో దూకి ప్రాణత్యాగం చేసిందట. దీంతో అచ్చయమ్మ  పేరిట ఆ తర్వాత గుడి నిర్మించి.. అచ్చియమ్మ పేరిట పేరంటాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న తంతు అని గ్రామస్తులు చెబుతున్నారు. 

 

 

 ఇక ఈ ఏడు కూడా ఈ ఆచారం కొనసాగింది. ప్రతి సంవత్సరం గ్రామానికి చెందిన వివాహం కానీ మైనర్లకు ఈ  విధమైన పెళ్లి కాని పెళ్లి జరిపిస్తారు గ్రామస్తులు. గ్రామస్తులు అందరి సమక్షంలో ఈ పెళ్లి తంతు జరుగుతోంది. ఇక పెళ్లి లో ఏర్పాటు చేసినట్లుగానే  విందు భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడితో ఈ తంతు ముగిసిపోతుంది. పెళ్ళి తంతు పూర్తి అయిన తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకున్న ఇద్దరు మైనర్లకు  ఎటువంటి సంబంధం ఉండదు. ఆ తర్వాత వీరిద్దరికీ పెళ్లి వయస్సు  వచ్చాక తమకు నచ్చిన పెద్దలు కుదిర్చిన వారిని పెళ్లి చేసుకోవచ్చు. అప్పటి అనాగరిక ఆచారాన్ని సాంప్రదాయాన్ని  గ్రామస్తులు మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ గ్రామంలో శుభకార్యాలు ఆ సంవత్సరం నుండి మొదలు పెడతారు. అంతవరకు గ్రామంలో పెళ్లి తంతు వంటి కార్యక్రమాలు జరుపుకోరు.

మరింత సమాచారం తెలుసుకోండి: