కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి అంటూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆందోళనకారులు అందరూ రెచ్చిపోయి మరీ ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

 

 

 పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్ఆర్సి ని  అమలు చేయబోమని తేల్చి చెప్పేశారు. ఇక ఈ చట్టం పై తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్ర పరిధిలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామని మద్దతు  ప్రకటించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మొదట ఎన్ఆర్సి పై నోరు విప్పినప్పటికీ... ఆ తర్వాత మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యి  ఎన్ఆర్సి కి వ్యతిరేకత తెలపాలని కోరడంతో ఎన్ఆర్సీ ని  వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

 

 

 ఇక తాజాగా ఎన్ఆర్సీ పై  తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్సీ  అమలు చేయబోమని  హోం మంత్రి మహమ్మద్ అలీ తేల్చిచెప్పారు. ఈ విషయంలో హోం మంత్రిగా తాను ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపిన మహమ్మద్ అలీ.. దశాబ్దకాలంగా ఉంటున్న వాళ్ళు ఎన్ఆర్సీ  కోసం బర్త్ సర్టిఫికెట్లు దాచి పెట్టుకొని ఉంటారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా ఎన్ఆర్సి అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని కేంద్రం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: