భారత కరెన్సీ మొదలైనప్పటి నుంచి భారత కరెన్సీ పైన స్వతంత్ర సమరయోధుల బొమ్మలు వేయడం ఆనవాయితీ గా వస్తోంది. ఇక రాను రాను జాతిపిత భారతదేశానికి స్వతంత్రం  తెచ్చి పెట్టిన మహనీయుడు.. స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన శాంతిదూత మహాత్మా గాంధీ రూపాన్ని కరెన్సీ పై ముద్ర వేస్తూ ఉంటాం. ప్రస్తుతం భారత కరెన్సీ నోట్ ఫైన  మహాత్మా గాంధీ బొమ్మ కష్టంగా కనిపిస్తోంది. మహాత్మా గాంధీ బొమ్మలో  ఏవైనా చిన్న తేడాలు ఉన్నాయి అంటే అది దొంగ నోటు అని అంటారు. మన కరెన్సీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత కరెన్సీ ప్రతి నోట్ పైన మహాత్మాగాంధీ కనిపిస్తున్నాడు. అటు కేంద్ర ప్రభుత్వం లో ఎన్ని పార్టీలు మారినప్పటికీ కూడా మహాత్మా గాంధీ బొమ్మ ను తీసేసి వేరే బొమ్మలు వేయడానికి మాత్రం ఆలోచన చేయలేదు.

 

 

 

 కానీ ఇక్కడ ఒక ఎంపీ మాత్రం భారత కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ను తొలగించి లక్ష్మీ దేవి బొమ్మను వేయాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఎంపీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మను ముద్రిస్తే మన కరెన్సీ పరిస్థితి మెరుగుపడుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు తెలియాలంటే స్టోరీలో వెళ్లాల్సిందే. ఇండోనేషియా కరెన్సీ లాగే  మన దేశ కరెన్సీ పైన దేవుళ్ళ బొమ్మలు ముద్రిస్తే ఎంతో మేలు జరుగుతుందని బిజెపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి... అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

 ఇండోనేషియా కరెన్సీ పై గణేశుని బొమ్మ ముద్రించడానికి విలేకరులు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రస్తావించగా... ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మన కరెన్సీ పైన కూడా లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరెన్సీ నోట్లపై దేవుళ్ళ బొమ్మలు ముద్రించడానికి తాను పూర్తిగా అనుకూలమే అంటూ చెప్పుకొచ్చారు. భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మను ముద్రిస్తే మన కరెన్సీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు సుబ్రమణ్య స్వామి. ఈ విషయంలో ఎవరూ చెడుగా భావించవద్దని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: