ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కాకముందు కేసియార్ ఊ అంటే తన పదవికి రాజీనామా చేసేవారు.  ఎంపిగా ఉన్న సమయంలోనే సుమారు మూడుసార్లు రాజీనామాలు చేసి ఉపఎన్నికలు వచ్చేట్లు చేశారు. రాజీనామాలు, ఉపఎన్నికలపై బాగా హీట్ పెంచేసి వెంటనే  ఎంపిగా రాజీనామా చేసేవాడు కేసియార్. తర్వాత  ఉప ఎన్నికలు రావటం, అందరూ పోటి చేసినపుడు కేసియారే మళ్ళీ గెలవటం అందరికీ తెలిసిందే. కేసియార్ ఎందుకు అలాచేశారంటే ఉద్యమ స్పూర్తిని నిలిపి ఉంచేందుకు. అప్పట్లో ఆ వ్యూహం కేసియార్ కు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి.

 

ఇక ఏపి విషయానికి వస్తే అంత ధైర్యం చంద్రబాబునాయుడుకు ఉందా అన్న చర్చ మొదలైంది.  లేకపోతే చంద్రబాబు కూడా కేసియార్ నే ఫాలో అవుదామని అనుకుంటున్నారా ? అన్న అనుమానం మొదలైంది.  గడచిన మూడు రోజులుగా  మూడు రాజధానుల ప్రతిపాదనపై వైసిపి ఎంఎల్ఏలందరు రాజీనామా చేయాలని చంద్రబాబు  పదే పదే డిమాండ్  చేస్తుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి.  జనాలెవరూ అమరావతిని రాజధానిగా తరలించటానికి ఇష్టపడటం లేదు కాబట్టి వైసిపి మళ్ళీ ప్రజా తీర్పును కోరాలంటూ ఓ పిచ్చి డిమాండ్ చేస్తున్నారు.

 

అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలంటూ ఓ ఐదారు గ్రామాల జనాలు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు.  గుంటూరు, కృష్ణా జిల్లాల జనాలు  కూడా పెద్దగా చంద్రబాబుకు మద్దతుగా నిలబటం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే వైసిపి ఎంఎల్ఏలను రాజీనామాలు చేయమని కోరేబదులు తన ఎంఎల్ఏలతో చంద్రబాబే రాజీనామాలు చేయించొచ్చు కదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి లేండి.  

 

కేసియార్ కూడా అప్పట్లో తాను రాజీనామాలు చేశాడే కానీ అధికారపార్టీ వాళ్ళని రాజీనామాలు చేయమని అడగలేదు. ఎవరికి అవసరమైతే వాళ్ళే రాజీనామాలు చేయాలన్న కనీస ఇంగితం కూడా చంద్రబాబు కోల్పోయారన్నది అర్ధమైపోతోంది. తనకు జనాల మద్దతు ఉండటమే నిజమైతే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఎందుకు ఓడిస్తారు ?  తన ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయిస్తే మళ్ళీ గెలుస్తారన్న నమ్మకం చంద్రబాబులో ఉన్నట్లు లేదు. లేదంటే తన డిమాండ్ పై  జనాల్లో బాగా చర్చ జరిగిన తర్వాత రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: