గిన్నిస్ బుక్ లో అరుదైన రికార్డు.ప్రపంచంలోనే అత్యున్నత రికార్డు ఏదైనా ఉంది అంటే అది గిన్నిస్ బుక్ రికార్డు. గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వివిధ రకాలుగా గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడం సాధారణ విషయమేమి  కాదు కదా. గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడానికి వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఎన్నో  సంవత్సరాల శ్రమ ఉంటుంది. ఏదో టైం పాస్ కి ఇలా వచ్చి అలా రికార్డు కొట్టుకుపోవడం సాధ్యమయ్యే పని అయితే అందరూ గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తారు. గిన్నిస్ రికార్డ్  సాధించడానికి ఎంతో మంది ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది తాము నెలకొల్పిన గిన్నిస్ బుక్  రికార్డును వారే తిరగరాసిన ఉంటారు. 

 

 

 ఈ మధ్యకాలంలో మహిళలు జుట్టుని పెంచడానికి ఎన్నో కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు పెరగడానికి ఎన్ని షాంపూలు వాడినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో కొత్త జుట్టు పెరగడం దేవుడెరుగు ఉన్న జుట్టు ఊడిపోకపోతే చాలు అని సర్దుకుపోతున్నారు. పెరుగుతున్న కాలుష్యం పని ఒత్తిడిల కారణంగా రోజురోజుకు మహిళల జుట్టు సైజు కాస్త తక్కువ అయిపోతుంది. కేవలం ఆ కాలంలో మాత్రమే పొడవాటి జడ కనిపించేవి... ఇప్పుడు మాత్రం పొడవాటి జడ  కాదు కదా చిన్న చిన్న పిలకలు  మాత్రమే ప్రతి ఒక్క మహిళ కి దర్శనమిస్తూ వుంటాయి. ఇప్పుడు అదే స్టైల్ కావడంతో ఎక్కువగా చిన్న జుట్టు ఉంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.

 

 

 ఇక్కడ ఒక యువతి మాత్రం తన జుట్టుతో గిన్నిస్ బుక్ లో రికార్డు సంపాదించింది. గుజరాత్లోని.. అరవిల్లి  కి చెందిన పదిహేడేళ్ళ నీలాంశి పటేల్ గిన్నిస్ బుక్ లో తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న మహిళ గా నిలిచిన నీలాంశి  పటేల్ రెండో సారి  గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించింది. 2018 సంవత్సరంలో 170.8 సెంటి మీటర్ల తో ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న మహిళ నీలాంశి  గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. ఇక తాజాగా ఆమె చుట్టూ 190 కి చేరుకుంది. తనకు రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: