ఈ మద్యకాలంలో పెళ్లి పేరుతో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే, అసలు పెళ్లి అనే దాని మీదే నమ్మకం పోతుంది. పెళ్లి పేరుతో జరిగే మోసాలు ఎన్నో ఎన్నెన్నో నిత్యం వార్తల్లో వస్తున్నాయి.  అంతే కాకుండా పురుషులు, పురుషులను, మహిళలు, మహిళలను. ఇంకా లింగ మార్పిడి చేసుకుంటూ నచ్చిన తీరుగా బ్రతకడానికి అలవాటు పడుతున్నారు. అంతే కాకుండా డబ్బు కోసం కొందరు వేషాలు వేస్తున్నారు.

 

 

చివరికి కట్టుకున్న వారిని కూడా మోసం చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ ఒక ఉగాండా ఇమాం కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కానీ అతను పెళ్లి చేసుకున్నది మగవాన్నే అని పరాయి వారు చెప్పేదాక కనిపెట్టలేక పోయాడు.. ఆ వివరాలు తెలుసుకుంటే. ఉగాండా ఇమాం మహ్మద్‌ ముతుంబా సరిగ్గా పదిహేను రోజుల కిందట ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాతి రోజు తన భార్యతో శారీరకంగా కలవడానికి ప్రయత్నించగా ఆ వధువు తనకు రుతుక్రమం నడుస్తోందని చెప్పారని ఇమాం డైలీ నేషన్‌ పత్రికతో మాట్లాడుతూ వాపోయారు.

 

 

అయితే ఇలా రెండు, మూడు రోజులు గడిచాకా ఇమాం పెళ్లి చేసుకున్న వ్యక్తి స్త్రీ కాదని, పురుషుడని తెలిసింది. ఈ విషయం కూడా అతను గుర్తించకపోవడం గమనార్హం. ఇకపోతే ఆ వధువుని పురుషునిగా గుర్తించింది పక్కింటివారట. ఇదెలా అంటే అతను దొంగతనం చేస్తుండగా చూసి అసలు విషయాన్ని కనుగొని ఇమాం కు చెప్పగా అతను షాక్ తిన్నాడు.

 

 

ఇక వెంటనే ఇమాం పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన ఒక మహిళా పోలీస్‌ అధికారి అనుమానితురాలిని పరిశీలించగా ఆమె కాస్తా స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడని తేలడంతో అవాక్కయ్యారు. ఇమాంను మోసం చేసినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, నిందితుడిపై చీటింగ్‌, చోరీ కేసులను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇకపోతే ఇమాంను డబ్బు కోసమే స్త్రీలా నటించి పెళ్లి చేసుకున్నానని నిందితుడు ఒప్పుకోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: