రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రైతులందరూ రోడ్ల పైకి చేరి తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో సర్వత్రా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని అటు బిజెపి టిడిపి జనసేన పార్టీలన్నీ వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. వెంటనే ముఖ్యమంత్రి 3 రాజధానిల  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. 

 

 

 ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను పవన్ కళ్యాణ్ కలవడం పై ఎన్నో ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల విషయంలో బీజేపీతో కలిసి ఉద్యమం  చేయాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తో భేటీ అయినట్లు సమాచారం. ఇక తాజాగా మరోసారి విజయవాడలో బిజెపి జనసేన కీలక సమావేశం నిర్వహించనున్నారు. అయితే జనసేనతో సమావేశానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కోర్ కమిటీ సమావేశం అయినట్లు సమాచారం. 

 

 

 

 ఇక మరికాసేపట్లో బీజేపీ జనసేన నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బిజెపి తరఫున ఇంచార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణఎంపీ జివిఎల్,  పురందేశ్వరి హాజరుకానున్నారు... ఇక జనసేన పార్టీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. రెండు పార్టీలు కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం . ఈ రెండు పార్టీల సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశముంది. అయితే ఈ రెండు పార్టీలు కలిసి అమరావతి పై పోటీ చేయడం వల్ల ప్రజలకు ఈ రెండు పార్టీలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీల పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అటు  అమరావతి రైతులు కూడా ఈ రెండు పార్టీలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి అనే దానిపై ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: