ఈరోజుల్లో మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్న పెద్ద తేడాలేకుండా మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు చాలామంది. అయితే మధుమేహం ఎక్కువగా ఉన్నవాళ్లు తీపి వస్తువులు ఎక్కువగా తినకూడదు అంటారు. అంతేకాకుండా తీపి వస్తువులు ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వస్తుంది అని చెబుతుంటారు. సాధారణంగానే తీపీ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల అధికంగా బరువు పెరిగి మధుమేహం వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ జాబితాలో కి ఉప్పు కూడా వచ్చి చేరింది. ఉప్పు తింటే మధుమేహం రావడం ఏంటి అంటారా... తాజా అధ్యయనంలో ఉప్పు  తిన్న మధుమేహం ముప్పు ఉంది అని తేల్చేసింది. 

 

 

ఉప్పు  తినడం వల్ల మధుమేహం బారిన పడే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. స్టాక్హోమ్ లో ని కోరొలిన్స్కా  ఇనిస్టిట్యూట్ నిర్వహించిన తాజాగా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఉప్పు ద్వారా లభించే సోడియం తక్కువ మొత్తంలో తీసుకునే వారితో పోలిస్తే రోజుకు సుమారు 2,800 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువగా తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనకారులు తేల్చేశారు.ఉప్పు  ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్ ను  నిరోధిస్తుందని... ఇది డయాబెటిస్ వ్యాధి దరి చేరేందుకు దారితీస్తుంది  అంటూ అధ్యయనకారులు తెలిపారు. 

 

 

 ఉప్పు ను తగిన మోతాదులో తీసుకోవాలని..  మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటు గురికావడంతో పాటు బరువు  కూడా భారీగా పెరిగి పోతారు అని... దీంతో ఇది మధుమేహానికి దారితీస్తుంది అని అధ్యయనకారులు చెబుతున్నారు. మధుమేహం భారీ నుంచి తప్పించుకోవాలి అంటే  తీపి పదార్థాలు తక్కువగా తీసుకోవడంతో పాటు  ఉప్పు కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి అని చెబుతున్నారు. ఉప్పు కూడా ముప్పు చేస్తున్నదని  అందుకే వీలైనంత దూరంగా వుండాలి అని సూచిస్తున్నారు. రోజుకు 2800 మిల్లీ గ్రాముల కు మించి  తీసుకోకూడదని సూచిస్తున్నారు పరిశోధనకారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: