రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్న రైంతాగాన్ని పరామర్శించటానికి ఇంత కాలానికి  ఈ ఎంఎల్ఏకి తీరిక దొరికింది.  రాజధానిని అమరావతి నుండి తరలించేందుకు వీల్లేదంటూ చంద్రబాబునాయుడు అండ్ కో గడచిన 30 రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. భూములిచ్చిన అన్నీ గ్రామాల్లోను తన పిలుపుకు స్పందన లేకపోవటంతో చంద్రబాబు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జనాలను రెచ్చ గొడుతున్నారు. చివరకు సెంటిమెంటును రంగరించి  విరాళలంటూ జోలె పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

వియ్యంకుడు కమ్ బావమరిది కమ్ టిడిపి అధ్యక్షుడు రాష్ట్రంలో ఇంత రచ్చ చేస్తున్నా హిందుపురం ఎంఎల్ఏ బాలకృష్ణ కనీసం అటువైపు తొంగి కూడా చూడలేదు. పైగా రాజధాని తరలింపుపై తన అభిప్రాయం కూడా చెప్పలేదు. దాంతో బాలకృష్ణ తీరుతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడిపోయారు. ఎందుకంటే స్వయాన బావమరిది కమ్ ఎంఎల్ఏ బాలకృష్ణే మద్దతు పలకలేదనే ప్రచారం జనాల్లో బాగా పెరిగిపోయింది.

 

ఇందుకనే కుటుంబంలో ఏం మాట్లాడుకున్నారో ఏమో ? మొత్తానికి బాలయ్యతో పాటు ఆయన భార్య వసుంధర, కూతురు నారా బ్రాహ్మణి రాజధాని గ్రామాల్లో పర్యటించటానికి గురువారం ముహూర్తం పెట్టుకున్నారు. సరే వీళ్ళ ముగ్గురు వస్తున్నపుడు అల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాకుండా ఉంటారా ?  మొత్తానికి వీళ్ళ నలుగురు కలిసి తుళ్ళూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో జరుగుతున్న దీక్షా శిబిరాలను సందర్శిస్తారని సమాచారం. అలాగే ఆందోళనల్లో కూడా పాల్గొంటారట.

 

ఆమధ్య మామగారితో కలిసి అత్తగారు అంటే నారా భువనేశ్వరి ఎర్రుబాలెంలో జరిగిన దీక్షలో  జనవరి 1వ తేదీన పాల్గొన్న విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు విరాళ కోసమని అత్తగారు తీసిచ్చిన గాజులపై  తర్వాత కాలంలో ఎంత వివాదం రేగిందో అందరూ చూసిందే. మరిపుడు పర్యటించబోతున్న కోడలు నారా బ్రాహ్మణి ఏం చేస్తుందో ? ఏం మాట్లాడుతుందో చూడాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: