ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు రోజు రోజుకు క్షిణిస్తున్నాయి.  కాశ్మీర్ అంశం తరువాత మరింత దిగజారిపోయింది.  అవకాశం దొరికితే ఇండియాపై విరుచుకుపడేందుకు పాక్ ఎప్పుడు రెడీగా ఉంటోంది.  అయితే, ఇండియా అందుకు అవకాశం ఇవ్వడం లేదు అన్న సంగతి తెలిసిందే.  అవకాశం ఇస్తే ఏం చేస్తుందనే విషయం అందరికి తెలిసిందే. పాకిస్తాన్ మాత్రం ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాలుగా చేసేందుకు ఎత్తులు వేస్తూనే ఉండటం విశేషం.  


ఇక ఇదిలా ఉంటె, ఇటీవలే ఆఫ్రికాకు చెందిన ఓ దేశం విషయంలో ఐరాస భద్రతా మండలి సీక్రెట్ గా సమావేశం అయ్యింది.  ఈ సమావేశంలో ఆఫ్రికా అంశంతో పాటుగా కాశ్మీ అంశాన్ని కూడా చర్చించాలని చైనా పట్టుబట్టింది.  కానీ, సభ్యదేశాలు ఏవి కూడా అందుకు మద్దతు ఇవ్వలేదు.  కాశ్మీర్ ఇండియా అంతర్గత విషయం అని, ఆ విషయంలో జోక్యం చేసుకోబోమని సభ్యదేశాలు స్పష్టం చేశాయి.  దీంతో చైనాతో పాటు పాక్ కూడా ఖంగు తిన్నది.  


చైనా ద్వారా భద్రతా మండలిలోను అలానే ఐరాస సర్వసభ సమావేశాల సమయంలోను ఒత్తిడి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.  పాక్ చేస్తున్న ప్రయత్నాలు రవ్వంత కూడా పారకపోవడంతో పాపం పాకిస్తాన్ దిక్కుమొక్కు తెలియక ఇబ్బందులు పడుతున్నది. ఇండియా మాత్రం వీటిని పక్కన పెట్టి రెండు దేశాల అభివృద్ధికి కృషి చేయాలనీ, ఈ విషయంలో పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తామని ఇండియా చెప్తున్నది.  


కానీ, పాక్ మాత్రం దానికి ఒప్పుకోకుండా కయ్యానికి దూకేందుకు సిద్ధం అవుతున్నది.  పాక్ దూకుడు వెనుక చైనా మాస్టర్ మైండ్ ఉందనే విషయం అందరికి తెలుసు.  ఇండియా అన్ని రంగాల్లో కనుక ఎదిగితే, దాని వలన చైనాకు ఇబ్బందులు వస్తాయి.  ఇప్పటికే ఇండియా ఆర్ధికంగా చైనాతో పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నది.  ఇండియాను ఆర్ధికంగా దెబ్బకొట్టాలి అంటే, పాక్ ను ఎగదోయాలి.  అందుకే చైనా ఈ పని చేస్తున్నది.  ఎలాగైనా ఇండియాను దెబ్బకొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: