తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విభజన, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందడుగులు వేస్తున్నాయి. ఇటీవలే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ జరిపిన భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈరోజు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారని తెలుస్తోంది. పరస్పర సహకారంతో రెండు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలు ఇరు రాష్ట్రాల సీఎంల స్నేహ హస్తాన్ని స్వాగతిస్తున్నాయి. 
 
ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 9,10 షెడ్యూల్ సంస్థల విభజన సమస్యలు కూడా తీరతాయనే విశ్వాసాన్ని కూడా ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాయి. ఈ చర్చలు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు రప్పించడానికి దోహదం చేస్తాయని టీఎన్జీవో సంఘం భావిస్తోంది. 
 
ఏపీ నుండి రిలీవ్ అయిన ఏపీ విద్యుత్ ఉద్యోగుల గురించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఏపీ ఎన్జీవో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగాలని తీసుకున్న నిర్ణయం మొదటి అడుగు కాగా ప్రధాన కార్యదర్శుల భేటీ రెండో అడుగు అని చెప్పవచ్చు. ఈ సమావేశంలో నీటి పంపకాల విషయంలో సమస్యల గురించి కూడా పరిష్కారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఈరోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటీ కానున్నారు. సీఎం జగన్ ఏపీ ప్రధాన కార్యదర్శికి, సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తోంది. కృష్ణా గోదావరి అనుసంధానం గురించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ తరువాత ఏపీ అధికారుల బృందం తెలంగాణ అధికారుల బృందంతో చర్చించనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: