2019 సంవత్సరం డిసెంబర్ నెలకు కొన్ని రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల నోట్లను రద్దు చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర మంత్రులు స్పందించి 2,000 రూపాయల నోట్లను రద్దు చేయటం లేదని స్పష్టత ఇచ్చారు. కానీ తాజాగా 2,000 రూపాయల నోటు గురించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 500, 1000 నోట్ల రద్దు తరువాత అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో 2,000 రూపాయల నోటును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 
 
కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం 2,000 రూపాయల నోటులో భద్రతా ఫీచర్లు డొల్లతనంతో నిండి ఉన్నాయని తెలుస్తోంది. తాజా రికార్డుల ద్వారా దేశంలో చలామణీలో ఉన్న నకిలీ నోట్లలో సగానికి పైగా 2,000 రూపాయల నోట్లే అని సమాచారం అందుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సేకరించిన డేటా ప్రకారం 56 శాతం 2 వేల రూపాయల నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. 
 
ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న నకిలీ నోట్లలో 2,000 రూపాయల నోట్లు ఎక్కువ శాతం ఉన్నట్టు తెలిపింది. గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ ఫేక్ కరెన్సీ చలామణీ జరుగుతోందని గుజరాత్ ఫేక్ కరెన్సీకి అడ్డాగా మారిందని ఈ రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2016 సంవత్సరం నవంబర్ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 
 
ప్రధాని మోదీ నల్లధనాన్ని అరికట్టేందుకు, నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు అనే చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలు ఈ మహాయజ్ఞానికి సహకరించి నకిలీ కరెన్సీని, నల్లధనాన్ని అరికట్టడానికి సహకరించాలని ప్రజలను కోరారు. కానీ 2,000 రూపాయల నోట్లకు కూడా నకిలీ చేస్తున్నారనే విషయం ప్రజలకు షాక్ అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: