వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు ఎలాంటి పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొండా సురేఖ మంత్రిగా పనిచేసింది.  మురళి ఎమ్మెల్సీగా పనిచేశారు.  వరంగల్ నియోజక వర్గంలో వీరికి ఉన్న పేరు మామూలు పేరు కాదు.  అయితే, వైఎస్ఆర్ మరణం తరువాత జగన్ తో కలిసి నడిచారు.  జగన్ పార్టీలో చేరారు.  కొన్నాళ్ళు అక్కడే పనిచేసిన కొండా దంపతులు ఆ తరువాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తెరాస పార్టీలో జాయిన్ అయ్యారు.  


తెరాస లో వరంగల్ ఈస్ట్ నుంచి సురేఖ పోటీ చేసి విజయం సాధించింది.  మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు.  కానీ లాభం లేకపోయింది.  2018 లో కొండా సురేఖకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పరకాల నుంచి పోటీ చేశారు.  2014కు ముందు పరకాల కొండా సురేఖ సొంత నియోజక వర్గం.  కానీ, తెరాస లో జాయిన్ అయ్యాక ఆమెకు వరంగల్ ఈస్ట్ నియోజక వర్గాన్ని కేటాయించింది పార్టీ.  అక్కడి నుంచి విజయం సాధించింది.  


కానీ, 2018లో పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ తరపున పరకాల నుంచి పోటీలో దిగింది.  అయితే, అప్పటికే పరకాలలో తెరాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి మంచి బలం పుంజుకున్నాడు.  దీంతో అక్కడ కొండా సురేఖ ఓటమి పాలైంది.  ఈ ఓటమితో ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నది. కాగా, ఇప్పుడు ఆమె తిరిగి వరంగల్ ఈస్ట్ నియోజక వర్గంపై దృష్టి పెట్టబోతున్నది.  కాంగ్రెస్ పార్టీ కూడా వరంగల్ పై పట్టు సాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  


కాంగ్రెస్ పార్టీలో తిరిగి ప్రాబల్యం పెంచుకోవడానికి ఈ దంపతులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి, కొండా మురళి భూపాలపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే ఆ నియోజక వర్గాలపై దృష్టి పెట్టి ప్రజల తరపున పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: